ఘనంగా నర్సుల దినోత్సవం

నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డా. రాంబాబు , 11 వవార్డు ఆరి లోవ ఆసుపత్రి వైద్యాధికారి డా.అనితల సహకారంతో ఈ వేడుకలను నిర్వహించారు.తొలుత విమ్స్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి మేయర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నైటింగేల్ జయంతి సందర్భంగా స్టాఫ్ నర్సులు,నర్సింగ్ సిబ్బందికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లాలో వున్న నర్సులందరి గౌరవార్థం , కరోనా విపత్కర పరిస్థితుల్లో వారి సేవలకు కృతజ్ఞతగా మేయర్,సిబ్బంది ఆగకుండా అయిదు నిముషాల పాటు చప్పట్లు కొట్టి అభినందించారు. అనంతరం మేయర్ కేక్ కట్ చేసి స్వయంగా స్టాఫ్ నర్స్ లకు తినిపించారు.అలాగే మిఠాయిలు పంచిపెట్టారు.అనంతరం అందరి తరపున నర్సులకు సన్మానం చేశారు. తొలుత విమ్స్ డైరెక్టర్ డా రాంబాబు మాట్లాడుతూ నర్సుల దినోత్సవ విశిష్టత ను వివరించారు. కరోనా ప్రారంభం నుంచి నర్సులు అందిస్తున్న సేవలు అద్భుతమని వారిని గౌరవించాలని మేయర్ రావటం సత్కరించటం స్ఫూర్తి దాయకం అన్నారు. ముఖ్య అతిథి మేయర్ మాట్లాడుతూ కరోనా తో పోరాడి బతికిన రోగులకు ఇది వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్ అందించిన పునర్జన్మ గా పేర్కొన్నారు.
సొంత వారు సైతం దూరంగా ఉంటున్నా.. ఈ భయంకర కరోనా మహమ్మారి భారిన పడిన వారికి నర్సింగ్ సిబ్బంది మాత్రమే అక్కున చేర్చుకొని సేవలు అందిస్తున్నారని ఆమె ప్రశంసించారు. కోవిద్ ప్రత్యేక వార్డుల్లో,అత్యవసర యూనిట్లలో అహర్నిశలు పనిచేస్తున్న దేవతలు నర్సింగ్ సిబ్బంది అంటూ మేయర్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా అధిక సంఖ్యలో స్టాఫ్ నర్సులు మేయర్ దగ్గరకొచ్చి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాస్,అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మేయర్ బుదవారం ఆరిలోవ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బందికి సన్మానం చేశారు.ఆస్పత్రి వైద్యాధికారి డా. అనిత, సిబ్బంది సేవలను కొనియాడారు. డా అనిత మాట్లాడుతూ వ్యాక్సినేషన్,కో విద్ సేవలతో నెలల తరబడి అవిశ్రాంతంగా గడుపుతున్న తమ ఆస్పత్రి సిబ్బందికి మేయర్ శుభాకాంక్షలు తెలిపి, సత్కరించటం ఆనందంగా వుందని అన్నారు.మేయర్ మాట్లాడుతూ దేశం మొత్తం నర్సుల సేవలకు ప్రణమిల్లుతోందన్నారు.ఇదే స్ఫూర్తి తో రానున్న రోజుల్లో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కోరారు.

(Visited 52 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *