పారిశుధ్య కార్మికుల‌కు వేత‌నాలు చెల్లించాలి


అనకాపల్లి: జిల్లాలో వివిధపంచాయితీలోపనిచేస్తున్నపంచాయితీపారిశుద్ధ్యకార్మికులు,
స్వచ్ఛ భారత్ మిషన్ లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ (హరిత రాయబారుల)కు పెండింగ్ లోఉన్న వేతనాలును తక్షణమే చెల్లించాలని, ఆంద్రప్రదేశ్ పంచాయితీవర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శ కోన.లక్ష్మణ డిమాండ్ చేశారు . మండలంలోని కొత్తూరుమేజర్ పంచాయితీ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోన.లక్ష్మణ మాట్లాడుతూ.కరోనా వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్న కార్మికులుకు బ్లౌజులు, మాస్కలు, 50లక్షలు ఎక్స్ గ్రేషియా అమలులోగాని, భరోసా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు .గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్న కరోనా లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పంచాయితీ, గ్రీన్ అంబాసిడర్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలని బ్లౌజులు లేకుండా గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ సున్నం చల్లుట మూలంగా చేతులు బొబ్బలు పోతున్నాయని శానిటైజర్, మాస్కులు సరఫరా లేకపోయినా కరోనా ఇండ్ల దగ్గర సేవలు చేస్తున్నారని తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్ గా గుర్తించి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్,స్వచ్ఛంద మిషన్స్ పేరు గొప్ప అందులో పనిచేసే కార్మికుల సంక్షేమం కడు దయనీయంగా ఉందన్నారు.
కరోనాను సైతం లెక్క చేయకుండా పనులు చేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెండింగ్ లో ఉన్న 5 నెలలు వేతనాలు తక్షణమేచెల్లించి కార్మికులు కుటుంబాలను ఆదుకోవాలని ,మున్సిపల్ కార్మికుల మాదిరిగానే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 18000 రూపాయలు ఇచ్చి సామాజిక భద్రత చట్టం లో భాగంగా పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి పనీ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

(Visited 61 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *