ప్రణబ్‌ దాదా.. రాజకీయ కాళిదాసు

(11వ తేదీన ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా)

నిరుపమాన రాజనీతిజ్ఞుడు, రాజకీయమార్తాండుడు, కర్మయోగి, రాజకీయసమరాంగణంలో సవ్యసాచి, అపరచాణక్యుడు, ప్రణబ్‌ ముఖర్జీ 1935 డిసెంబర్‌ 11వ తేదీన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పశ్చిమ బెంగాల్‌ లోని బిర్భుమ్‌ జిల్లా మిరాటీలో జన్మించారు. తల్లి రాజ్యలక్ష్మీ. తండ్రి కమద కింకార్‌ ముఖర్జీ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడమే కాకుండా పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు.

తండ్రి బెంగాల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో 1952 నుండి 1964 వరకు సభ్యులుగా ఉన్నారు. ప్రణబ్‌ చిన్నవయస్సులో రోజూ 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేవారు. వర్షాకాలంలో వాగు ఈదుకుంటూ వెళ్లేవారు.ప్రణబ్‌ ముఖర్జీ ఉన్నత విద్యావంతులు. సూరి విద్యాసాగర్‌ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, రాజనీతి శాస్త్రములలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయడమే గాక న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. కలకత్తా విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉండే విద్యాసాగర్‌ కళాశాలలో రాజనీతి శాస్త్రంను బోధించేందుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 1963లో చేరారు. 1957 జూలై 13వ తేదీన సువ్రా ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు అభిజిత్‌, ఇంద్రజిత్‌ అనే ఇద్దరు కుమారులు, శర్మిష్ట అనే కుమార్తె గలరు.తరవాత దేశేర్‌ దక్‌ అనే పత్రికకు రిపోర్టర్‌గా చాలాకాలం పనిచేసారు.

కలకత్తాలోని తంతి తపాలా శాఖలో డిప్యూటీ అక్కౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో యుడిసిగా కొంతకాలం పనిచేసారు. 1966లో కాంగ్రెస్‌ నుండి విడిపోయి అజోయ్‌ ముఖర్జీ నేతృత్వంలో బంగ్లా కాంగ్రెస్‌ ఏర్పడినప్పుడు ఆ పార్టీలో ప్రణబ్‌ చేరారు. బంగ్లా కాంగ్రెస్‌ అభ్యర్ధిగా 1969లో తొలిసారిగా రాజ్యసభలోకి ప్రణబ్‌ ముఖర్జీ అడుగుపెట్టారు.1969 జనవరి 1వ తేదీనుండి 2002 ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. తన తండ్రి కాంగ్రెస్‌పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న నేపథ్యంలో తండ్రి బాటలో నడిచి 1971లో కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నారు. మిడ్‌పూర్‌ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి వికె కృష్ణమీనన్‌కు ప్రచారం గావిస్తూ ఒకసారి, బాంకు జాతీయకరణకోసం పార్లమెంటులో మాట్లాడుతూ మరోసారి ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. ప్రణబ్‌ చురుకుదనాన్ని గుర్తించి ప్రణబ్‌ను ప్రియశిష్యునిగా స్వీకరించారు. ఆయన 1973 నుండి 1974 వరకు కేంద్ర పారిశ్రామికాభివృద్ధి శాఖామాత్యులుగాను, 1974లో షిప్పింగ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ శాఖామాత్యులుగాను, 1974-`75 కాలానికి గాను ఆర్ధికశాఖ సహాయమంత్రిగాను, 1975 నుండి 1977 వరకు రెవెన్యూ మరియు బాంకింగ్‌శాఖకు కేంద్ర మంత్రిగాను, 1978 నుండి 1979 వరకు కాంగ్రెస్‌ పార్టీకి కోశాధికారిగాను, 1980 నుండి 1985 వరకు రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకునిగాను, 1980 నుండి 1982 వరకు వాణిజ్య,గనులు,స్టీల్‌ శాఖలకు కేంద్రమంత్రిగాను,1982 నుండి 1984 వరకు కేంద్ర ఆర్ధిక శాఖామాత్యునిగాను, 1982 నుండి 1985 వరకు ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌గాను, 1982 నుండి 1985 వరకు ప్రపంచ బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌గాను, 1982 నుండి 1984 వరకు ఏషియన్‌ డెవప్‌మెంట్‌ బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌గాను, 1982 నుండి 1984 వరకు ఆఫ్రికన్‌ డెవప్‌మెంట్‌ బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌గాను, 1984లో కేంద్ర వాణిజ్య మరియు సరఫరా శాఖామాత్యుగాలును, 1984లో భారత జాతీయ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ క్యాంపైన్‌ కమిటీ ఛైర్మన్‌గాను, 1984 జనరల్‌ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌పార్టీ క్యాంపైన్‌ కమిటీ ఛైర్మన్‌గాను, 1987 నుండి 1989 వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ ఆర్ధిక సహాయ సెల్‌ ఛైర్మన్‌గాను, 1991 జనరల్‌ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌పార్టీ క్యాంపైన్‌ కమిటీ ఛైర్మన్‌గాను, 1991 నుండి 1996 వరకు ప్లానింగ్‌ కమీషన్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గాను, 1993 నుండి 1995 వరకు కేంద్ర వాణిజ్యశాఖామాత్యులు గాను, 1998 జనరల్‌ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌పార్టీ క్యాంపైన్‌ కమిటీ ఛైర్మన్‌గా ప‌నిచేశారు.

1995లో సార్క్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌కు అధ్యక్షులుగాను, 1995 నుండి 1996 వరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామాత్యులుగాను, 1998 నుండి 1999 వరకు జాతీయ కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగాను, 1999 నుండి 2012 వరకు కేంద్ర ఎలక్షన్‌ కో-`ఆర్డినేషన్‌ కమిటీకి ఛైర్మన్‌గాను, 2004 నుండి 2012 వరకు లోక్‌సభలో కాంగ్రెస్‌పార్టీ నాయకునిగాను, 2004 నుండి 2006 వరకు కేంద్ర రక్షణశాఖామాత్యులుగాను, 2006 నుండి 2009 వరకు కేంద్ర విదేశీవ్యవహారాల శాఖామాత్యులుగాను, 2009 నుండి 2012 వరకు కేంద్ర ఆర్ధిక మంత్రిగాను, 2012 జూలై 25వ తేదీనుండి 2017 జూలై 25వ తేదీ వరకు భారత రాష్ట్రపతిగాను సేవలందించారు.

2015 ఆగస్టు 18వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీకి భార్యా వియోగం కలిగింది.2018 జూన్‌ నెలలో ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ప్రణబ్‌ ముఖర్జీ పెద్దకుమారుడు అభిజిత్‌ రాజకీయాల్లో రాణించాడు. కొంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆయన 2012 అక్టోబర్‌ 18వ తేదీన పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కుమార్తె శర్మిష్ట కథక్‌ నృత్య కళాకారిణి. ఆమె రాజకీయాల్లో కూడా ఉన్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రణబ్‌ముఖర్జీ పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. 2013 మార్చి5వ తేదీన బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌ గౌరవ పురస్కారం, 2016 జూన్‌లో ఐవరీకోస్ట్‌ దేశ పురస్కారం, 2017 ఏప్రిల్‌ 28వ తేదీన సైప్రస్‌ దేశపురస్కారం పొందారు.2011లో ఇంగ్లాండ్‌కు చెందిన ఊ్వర్‌హాంప్టన్‌ విశ్వవిద్యాయం, 2012 మార్చిలో అస్సాం విశ్వవిద్యాలయం, 2012లో కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయం, 2013లో ఢాకా విశ్వవిద్యాలయం, ఇస్తాన్‌బుల్‌ విశ్వవిద్యాలయం, మారిషన్‌ విశ్వవిద్యాలయం, 2014లో కకత్తా విశ్వ విద్యాలయం, 2015లో జోర్డాన్‌ విశ్వవిద్యాలయం, పాలస్తీనా విశ్వవిద్యాలయం, జెరూసలంకు చెందిన హిబ్రూ విశ్వవిద్యాలయం, 2016లో ఖాట్మండు విశ్వవిద్యాలయం, 2017లో గోవా విశ్వవిద్యాలయం, 2018లో చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయం ప్రణబ్‌ ముఖర్జీకి గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం గావించాయి.

భారత ప్రభుత్వం 2019లో భారత రత్న పురస్కారాన్ని ప్రదానం గావించింది. దీక్షా దక్షతకు చిరునామాగా నిలిచిన ప్రణబ్‌ తన ఇంట్లో క్రింద పడిపోయి, మెదడులో రక్తం గడ్డకట్టిన కారణంగా ఆగస్టు 10వ తేదీన న్యూఢల్లీ లోని ఆర్మీ రీసెర్చి రిఫరల్‌ ఆసుపత్రిలో చేరారు.21 రోజు పాటు మృత్యువుతో పోరాడి 31వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూసారు. ఆయన తన జీవితానుభవాలపై ‘‘ ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’’ అనే పుస్తకాన్ని రాసారు. ఈ ఏడాది డిసెంబర్‌ 11వ తేదీన అది విడుదల కావాల్సి ఉంది.

(Visited 5 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *