వెండితెరపై వంటలక్క

కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కోసం ఇళ్లల్లో పనులు మానుకుని మరీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. వంటలక్క పాత్రధారి మలయాళి నటి ప్రేమి విశ్వనాథ్ త్వరలో వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. వంటలక్కగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రేమి..వెండితెరపై కూడా అదే స్థాయిలో విజయవంతం కావాలని తాపత్రయపడుతోంది. వంటలక్క,..డాక్టర్ బాబూ అంటూ పలు రకాల సరదా మీమ్్సతో నెట్ జనులు సోషల్ మీడియాలో హంగమా చేస్తుంటారు.
ఇక ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో తెరకెక్కుతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఓ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించబోతోంది. నిజానికి కరోనా రాకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కేది. ఇప్పడు టీవీ సర్కిల్‌గా ఈ శుభవార్త వైరల్ అవుతుంది. తోటి నటీమణులు ప్రేమికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌ల సమయం మార్చాలని.. కార్తీక దీపం సిరియల్ సమయంలో మ్యాచ్ వద్దంటూ ఏకంగా స్టార్‌మాకు ఓ అభిమాని విజ్ఞప్తి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే కార్తీక దీపం సీరియల్‌కు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సదరు అభిమానికి ప్రేమి విశ్వనాథ్ ఓ 32 ఇంచెస్ టీవీ బహుమతిగా పంపిన విషయం తెలిసిందే.