ప్రైవేట్ టీచర్లకు కరోనా ప్యాకేజీ చెల్లించాలి

అనకాపల్లి : ప్రైవేటు టీచర్లకు తెలంగాణాలో ఇచ్చిన విధంగా కరోనా ప్యాకేజీ అందజేయాలని శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు డిమాండ్ చేశారు . తన కార్యాలయంంలో గురువారం ఆయన విలేక రులతో మాట్లాడారు . భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో ప్రైవేటు టీచర్ల , లెక్చరర్స్ సేవలు గణనీయమని . అయితే కరోనా కష్టకాలంలో ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు సరిగా నడవక పోవడం వల్ల అనేకమంది ఉపాధి కోల్పోయారని జగదీష్ తెలిపారు.. కుటుంబ పోషణ జరగక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు లెక్చరర్లు చనిపోయినా ముఖ్యమంత్రి జగన్ మనస్సు కరగడం లేదని నాగ జగదీష్ విమర్శించారు . ప్రైవేటు టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వము అండగా లేక పోవడం దురదృష్ట కరమని . పక్క రాష్ట్రం తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు నెలకు 2000 నగదు , 25 కిలోల బియ్యం ఇస్తోందన్నారు . ఇదే విధంగా మిగిలిన రాష్ట్రాలు ప్రైవేటు టీచర్లను ఆదుకుంటున్నాయన్నారు . ప్రైవేటు టీచర్లకు కరోనా ప్యాకేజీ కింద నెలకు రూ .10 వేలు , బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం ఇవ్వాలని జగదీష్ డిమాండ్ చేశారు.. సమాజంలో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అనుకోవడం ప్రైవేట్ గురువులుది పెద్ద తప్పు గా మారిందని అందుకే వారికి ఎటువంటి సహాయం కూడా ప్రభుత్వం చేయడం లేదని ..విద్యార్థులకు జగన్ అన్న అమ్మ ఒడి , జగన్ అన్న విద్యా దీవెన …… ఇస్తుండగా ప్రైవేట్ గురువులకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. ఆర్థిక ఇబ్బందులు మరియు ఆత్మహత్యలతో చనిపోతున్నా ప్రభుత్వంలో కదలిక లేదని, ఇదేనా సమాజంలో ప్రభుత్వం గురువులు కు ఇచ్చే గుర్తింపా అని నాగ జగదీష్ ప్రశ్నించారు.? ఈరోజు ఉదయం శాసన మండలి సభ్యులు కార్యాలయము నందు విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ తో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ జిల్లా బీసీ నాయకులు బోడి వెంకటరావు పాల్గొన్నారు

(Visited 125 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *