వీ డ్రీమ్స్ అనకాపల్లి
నేటి ఉదయం వి.వి.రమణ షుగర్స్ పరిరక్షణ సమితి సమావేశం కనిశెట్టి సురేష్ బాబు అధ్యక్షతన కోడుగంటి గోవిందరావు భవనంలో జరిగింది.
వక్తలు మాట్లాడుతు కొణతాల రామకృష్ణ గారి జనవరి 1న షుగర్స్ పై చేసిన ప్రకటనను అనకాపల్లి ప్రజలు గాని, చెరుకు రైతులు గాని వేరే ఎవ్వరు ఆహ్వానించేపరిస్థితులు లేవని, ఆ వ్యక్తిగత ప్రకటనను సమితి సభ్యులు ఖండిస్తున్నారని మరియు ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.
విల్లూరి పైడారావు మాట్లాడుతు తుమ్మపాల పంచదార ఫ్యాక్టరీ కూటమి ప్రభుత్వం వస్తే తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మీనమేశాలు లెక్కబెడుతున్నారని చెరుకు ఫ్యాక్టరీ కాకుండా వేరే ఇతర కార్యక్రమాలు చేస్తావని స్థానిక శాసనసభ్యులు ప్రకటన చేయడం రైతుల మనోభావాలను దెబ్బతీయడమేనని పైడారావు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో 13 వేల మంది సభ్యులు ఉన్నారని వీరి అభిప్రాయం తెలుసుకోకుండా షేర్ హోటల్స్ తో మీటింగ్ పెట్టకుండా మీటింగ్ పెట్టకుండా జనరల్ బాడీ లేకుండా సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు సుమారు 500 కోట్ల ఆస్తులు షుగర్ ఫ్యాక్టరీ కి ఉన్నాయని దీన్ని కాచేయడానికే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రైతుల తాలూకా అభిప్రాయం తీసుకొని షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కోటను ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
కర్రి అప్పారావు మాట్లాడుతు చెరుకు లేని కారణంగా వేరే పరిశ్రమలను స్థాపించటం హాస్యాస్పదం అని మీరు స్పష్టమైన హామీఇవ్వండి ఆరు మాసాలలో 2,00,000 టన్నుల చెరుకును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు వెంటనే రైతాంగానికి అనకాపల్లి వి వి రమణ షుగర్స్ ను పునరుద్దారణ చెయ్యాలని అటువంటి ప్రకటనను గురించి మాతో పాటు రైతాంగం ఎదురుచూస్తుందనివతెలిపారు.
కోరిబిల్లి శంకర్రావు మాట్లాడుతూ గతంలో ఈ ఫ్యాక్టరీలో డిస్టలరి, మిడిషన్, పినాయల్ వంటి ఉపుత్పత్తులతో విజయవంతంగా నడిచిందని అదే సామర్ధ్యంతో ఫ్యాక్టరీని పునర్ నిర్మాణం చెయ్యాలని డిమాండ్ చేసారు.
కనిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ గతం వై.సి.పీ కూడా అనకాపల్లి షుగర్స్ ను లిక్విడేషన్కు జీవో విడుదల చేసిందని ఆ జీవో నందు వారు ఫుడ్ ప్రాససింగ్ పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారని. అప్పుడు ఈ ప్రాంత రైతాంగంతో పాటు ప్రస్తుత కూటమిలో ప్రాధాన పార్టీ తెలుగుదేశం కూడా వ్యతిరేకించిందని. ఇప్పుడు మీరు కూడా వై.సి.పీ విధానాలనే అవలంభించదలుచుకున్నారా.. ఆ జీవోనే అమలు చెయ్యదలచారని ప్రశ్నించారు.. గతంలో కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి షుగర్స్ కు ఎనలేని సేవలు చేసారు గనక ఈ ప్రాంత రైతాంగం అంతా ఆధునీకరణ లాంటి మంచి ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్నారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో షుగర్స్ రైతులు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.