వీ డ్రీమ్స్ అనకాపల్లి
సోమవారం ఉదయం నుండి వాడవాడలా పండుగ వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. కూటమ్మ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా పెన్షన్ 4000 రూపాయలతో పాటు మరో 3 వేల రూపాయలు కలిపి అందిస్తుందని చేసిన మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున 6 గంటల నుండి ప్రభుత్వ ఉద్యోగులు, కూటమి నాయకులు కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పెనుమాకలో స్వయంగా తండ్రీ కూతుర్లకు పెన్షన్ అందజేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు ఆయా నియోజవర్గంలో పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగంగానే అనకాపల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పట్టణంలోని 80 వార్డు లోని ముదిరాజ్ కాలనీ అలాగే 81 వ వార్డు నెయ్యిల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లను అందజేసి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుండి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వీట్లు తినిపించి పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూటమి నాయకులు కూడా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బుద్ధ నాగ జగదీష్, ఉమ్మడి పార్టీల శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు