డ్రగ్స్ రహిత అనకాపల్లి జిల్లాగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కలెక్టర్ రవి పటాన్ శెట్టి

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా కు వ్యతిరేకంగా ఈరోజు అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ వద్ద కాలేజ్ విద్యార్థులతో ర్యాలీ ని జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టన్ శెట్టి ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు మరియు ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా మరియు దుర్వినియోగిస్తే జరిగే అనర్థాలను బోధించడం మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నిఘా ఉంచి, అట్టి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, డ్రగ్స్ రహిత అనకాపల్లి జిల్లాగా ఏర్పడే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.
జిల్లా ఎస్పీ కె.వి.మురళి కృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని గంజాయి అక్రమ రవాణా మరియు దుర్వినియోగం అరికట్టేందుకు కఠిన చర్యల్లో భాగంగా జిల్లాలో 4 స్టాటిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడంతో పాటు 11 డైనమిక్ చెక్ పాయింట్లు గుర్తించి, ప్రత్యేక బృందాలతో రవాణా మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కంట్రోల్ రూమ్ నుండి చెక్ పోస్ట్ లు దగ్గర ఉన్న కెమెరాల ద్వారా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.

మాదకద్రవ్యాలు వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశభవిష్యత్తును కుంగదీసే మాదకద్రవ్యాలను పకడ్బందీగా అరికడదమన్నారు. ప్రతి ఏటా జూన్ 26న మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ. కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నా మన్నారు. యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలు లేదా వినియోగిస్తున్న వారి
సమాచారం 14500 లేదా
డయిల్ 100/112 మరియు 9440904229 తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమవంతు సహాయ సహకారాలు అందించాలని, అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

2023 సం., నుండి ఇప్పటివరకు 189 కేసులు నమోదు చేసి, 501 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. 7,255 కేజీల గంజాయి, 108 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 7 గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది.

మాదక ద్రవ్యాల వలన జరిగే అనర్ధాలను వివరిస్తూ “అవేర్నెస్ ఆన్ వీల్స్” అనే ప్రోగ్రాంతో పాటుగా జిల్లాలోని విద్యాసంస్థలలో 136 యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు, 138 పెద్ద హోర్డింగ్స్, బ్యానర్స్, పోస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన కూడళ్లు వద్ద 17 హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుండి గ్రామ, మండల మరియు డివిజన్ పరిధిలో కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు బ్యానర్లు, పోస్టర్లు, మానవ హారాలు ఏర్పాటు చేయడం ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనకాపల్లి రింగ్ రోడ్ నుండి ఫోర్ రోడ్ జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ చేస్తూ “సే నోటు డ్రగ్స్, సేఎస్ టు లైఫ్”, “డ్రగ్స్ వద్దు ప్రాణం ముద్దు” “యువత మేలుకో డ్రగ్స్ నుండి తేరుకో” అను నినాదాలతో విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఫోర్ రోడ్ జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి, నారాయణ కాలేజీ విద్యార్థులు మాదకద్రవ్యాల వలన జరిగే అనర్ధాలు గూర్చి ఫ్లాష్ మాబ్ స్కిట్ ను ప్రదర్శించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించిన జిల్లా పోలీసులు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ బి.విజయభాస్కర్, పి.సత్యనారాయణ రావు, ఇంచార్జ్ ఆర్డిఓ రమమణి
డీఈవో శ్రీమతి లక్ష్మమ్మ, సెబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ కె.జై సింహ చౌదరి, అసిస్టెంట్
ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీమతి శైలజా రాణి, లక్ష్మణరావు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మనోహర్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, రోడ్ ట్రాన్స్పోర్ట్, మెడికల్ అండ్ హెల్త్ సంబంధిత అధికారులు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు, దిశా డీఎస్పీ శ్రీ ఎం ఉపేంద్ర బాబు, ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకర రావు, అనకాపల్లి రూరల్ సిఐ ధనుంజయ రావు, కసింకోట ఇన్స్పెక్టర్ వినోద్ బాబు, అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైడపు నాయుడు, ఆర్.ఐ సంజీవరావు, అనకాపల్లి ఎస్సైలు సత్యనారాయణ, అలీ షరీఫ్ తదితర అధికారులు, పోలీసు మరియు ఎస్.ఈ.బి సిబ్బంది, సీడ్ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ సూర్యప్రకాష్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్,
శ్రీ కన్య జూనియర్ కాలేజ్, సంయుక్త జూనియర్ కాలేజ్, శ్రీ చైతన్య, నారాయణ మరియు సర్వేపల్లి రాధాకృష్ణ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సుమారు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, ఇతర శాఖల అధికారులు వివిధ కళాశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు
Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *