వీ డ్రీమ్స్ అనకాపల్లి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల పక్షాన నిలిచే నాయకుడిగా చిరస్థాయిగా లేచిపోతాడని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి భరత్ బాబు అన్నారు. సోమవారం అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేసి పేదల పక్షాన నిలిచిన నాయకుడిగా నిలిచిపోయారన్నారు. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పయనిస్తాదని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పనులు సరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన నిస్వార్థ రాజకీయ నాయకులు కొణతాల రామకృష్ణ నాయకత్వంలో అనకాపల్లి మరింత అభివృద్ధి చెందుతాదని ఆయన ఆస భావం వ్యక్తం చేశారు. ఇక్కడ శారద నదిలో దెబ్బతిన్న గ్రోయిన్లకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టే రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పప్పల శ్రీను, కాకి సోమరాజు, నడిగట్ల శ్రీను, అప్పలస్వామి నాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.