వీ డ్రీమ్స్ పరవాడ
భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు లంకెలపాలెం పరవాడరోడ్డుపై పరవాడ మండల ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి.సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 2023 పేరు మీద డిసెంబర్ 21వ తేదీన పార్లమెంటులో బిల్లుని ఆమోదించింది దానికి గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారు డిసెంబర్ 25వ తేదీన ఆమోద ముద్ర వేశారు ఆ చట్టంలోని సెక్షన్ 106 (1) (2) ప్రకారం యాక్సిడెంట్ కేసులలో డ్రైవర్లకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది దీనిని అనకాపల్లి జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల మీద తీవ్రమైనటువంటి అలజడి అసంతృప్తి ఆందోళనకి గురిచేస్తూ ఉన్నది అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏంటి అనేటటువంటి పరిశీలించకుండా ప్రమాదాల నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టకుండా డ్రైవర్లది పూర్తి బాధ్యత చేయడం సరి కాదని గని శెట్టి అన్నారు. మోటార్ కార్మికులకు అండగా ఉండాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ల మీద ఎటువంటి చట్టాలు తీసుకొచ్చి జైల్లో పెట్టే విధంగా చట్టం చేయడం దుర్మార్గమని తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన పెద్ద ఎత్తున ఉదృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో లంకెలపాలెం ఆటో యూనియన్ నాయకులు ఎస్ గోవిందు, కే అప్పారావు, ఎన్ ముసిలి, డి మధు, వై నాగేష్, ఎస్ సన్యాసిరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
