వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం సృష్టించిన భూసమస్యల నుంచి రైతులను విముక్తులును చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆలోచన మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, అవినీతికి తావు లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని,
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ప్రభుత్వ కార్యాలయ ల చుట్టూ తిరగకుండా, మీ సమస్యలు పరిష్కరించుకోవాలని సురేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ కుమార్, ఆర్ ఐ రమేష్, కూటమి పార్టీ నాయకులు పూడి పరదేశి నాయుడు, చెక్కల శ్రీను, సైనిక్, నాయుడు,తదితరులు పాల్గొన్నారు.