వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 81 వ డివిజన్ గవరపాలెం కరెంట్ ఆఫీస్ కార్యాలయం నందు ఎఇ కే రాజేంద్రప్రసాద్ కి స్థానిక వేగి వీధిలో కరెంటు సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 81వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ వేగి వీధి చిన్న హైస్కూల్ నందు ట్రాన్స్ ఫార్మర్ నెం. 365 యొక్క లోడ్ సరిపడినందున, గత రెండు నెలలు నుండి విపరీతమైన కరెంటు సప్లై సమస్యలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని, గంట గంటకు కరెంటు సమస్యలు ఉండడం వల్ల చదువుకునే విద్యార్థులకు, నీరు పెట్టుకునే మహిళలకు, వ్యాపారస్తులందరికీ ఇబ్బంది కలుగుతుందని, కావున తమరు తక్షణమే స్పందించి సదురు ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్ చేసి సమస్యని పరిష్కరిస్తారని తెలియజేశారు. అనంతరం ఏఈ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ కచ్చితంగా సాయంత్రం కల్లా విజిట్ చేసి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేగి లక్ష్మి ( మాజీ కౌన్సిలర్), వేగి సూరిబాబు, వేగి కృష్ణ, ఆడారి సూరి అప్పారావు, కర్రీ మహాలక్ష్మి నాయుడు, అధిక స్థాయిలో వేగివీధి మహిళలు పాల్గొన్నారు.
