వీ డ్రీమ్స్ విశాఖపట్నం
జివిఎంసి 32వ వార్డులో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జివిఎంసి అధికారులను కోరారు.
గురువారం ఉదయం
జివిఎంసి ఏఈ శివ తేజశ్విని తో కలిసి డాక్టర్ కందుల నాగరాజు
32వ వార్డులో
నేరెలు కోనేరు, చలవతోట, ఏడుగుళ్ళు,అల్లిపురం మార్కెట్, కర్నాల్ వీధి లలో పర్యటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
32వ వార్డులో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయని అన్నారు.
ఇక్కడ డ్రైనేజి సమస్యలతో పాటు
వీధి లైట్లు, వీధి రోడ్లు అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు.
ఈ వార్డు పర్యటనలో పలు ప్రాంతాల్లో పర్యటించి
ఆ ప్రాంత సమస్యలను ఏఈ కి వివరించారు.
సాధ్యమైన మేరకు ఈ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని
కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఏఈ శివతేజస్విని వర్క్ఇన్స్పెక్టర్ గిరిబాబు ,బిజెపి నాయకులు
శాలివాహన,సిపిఐ బుజ్జి,
అదిబాబు, కుమారి,శ్రీదేవి, కోదండమ్మ,32వ వార్డు ఇంచార్జ్
కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.