టీటీడీ ప‌రువు తీస్తున్నారు

ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై టీడీపీ నేత కొణ‌తాల వెంక‌ట్రావ్ విమ‌ర్శ‌లు

అన‌కాపల్లి :తిరుమల తిరుపతి దేవస్థానం పరువు ప్రతిష్టలను మంటగలిపిన రమణదీక్షితులును దేవస్థాన ప్రధాన అర్చకులు గా నియమించడం వైసీపీ ప్రభుత్వం నీతి మాలిన చర్యని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు విమర్శించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని 2019 ఎన్నికలకు ముందు ప్రధానార్చక పదవి నుంచి తొలగించిన తరువాత లడ్డు తయారు చేసే పోటులో గుప్త నిధులు దోచుకున్నారని పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉన్నదని రమణ దీక్షితులు విజయసాయిరెడ్డి ఇరువురు కలిసి దేవస్థానం పై ఆరోపణలు చేసిన దాని పై ఆనాటి దేవస్థాన పాలకవర్గం అధికారులు 100 కోట్లు పరువు నష్టం దావా ఇద్దరు పైన కోర్టులో వివాదం నడుస్తుందని హిందూ సమాజం భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా కలియుగ ఆరాధ్య దైవం అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు పూజించే దేశవిదేశాల్లో ఉన్న భక్తులను తిరుమల స్వామివారి హుండీలో కానుకల వేయవద్దని విలేకరుల సమావేశం పెట్టి ప్రకటనలను ఇచ్చిన వ్యక్తిని ఈరోజు ప్రధాన అర్చకులుగా నియమించడం దౌర్భాగ్యం మని వెంకటరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం ఏర్పాటు చేసిన తర్వాత నుంచి దోపిడి ఏవిధంగా చేయాలి స్వామివారి ఆస్తులు ఏ విధంగా కాజేయాలని నిరంతరం పన్నాగాలు తో పాల్పడుతున్నారని ఈ దోపిడీదారులు స్వామి వారిని కూడా విడిచి పెట్టలేదని చెన్నైలో నిరుపయోగంగా ఉన్న భూముల్ని అమ్మి వేయడానికి ప్రయత్నించారని అలాగే చిన్న పిల్లల ఆసుపత్రి 300 కోట్ల రూపాయలు ఇస్తానన్న సూట్కేసులు కంపెనీ యజమాని సంజయ్ కేదార్ నాథ్ సింగ్ తో చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఈవో జోహార్ రెడ్డి కలిసి ఎన్ వో యు కుదుర్చుకున్నారని ఈ కంపెనీ నిజాయితీ ఏమిటో తెలుసుకోకుండా విమర్శలు రావడంతో విజిలెన్స్ విచారణ చేయమని ఆదేశాలు జారీ చేశారని వెంకటరావు తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి అలిపిరి వద్ద పది ఎకరాల భూమి ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించింది సంజయ్ కేదార్ నాథ్ సింగ్ పై అతను కంపెనీ ఉద్వేగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపే అనేక అనుమానాలు రావడంతో ఇలాంటి సూట్ కేస్ కంపెనీలను జగన్ సర్కార్ తెరపైకి తేస్తుందని దీనిపై ప్రభుత్వ సమగ్ర దర్యాప్తు జరపాలని నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని తలనీలాలు స్మగ్లింగ్ తరహాలో టిటిడి గొల్ల తనము స్వార్థం అవినీతికి ఆస్కార విచ్చే వ్యవహారాలు బయట పడుతున్నాయని వెంకటరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హిందూ భక్తుల మనోభావాలను ఏనాడు ఏ ప్రభుత్వం కూడా ఇంతలా దిగజార్చలేదని వెంకటరావు పేర్కొన్నారు.

(Visited 233 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *