సమాచార హక్కు చట్టం పక్కాగా అమలు చేయాలి


విశాఖపట్నం: సమాచార హక్కు చట్టం అమలు పై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, సమాచార కమిషన్ కు నివేదికలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ తెలిపారు.మంగళవారం నాడు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూపరింటెండెంట్ లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎటువంటి జాప్యం లేకుండా సమాచార హక్కు చట్టం అమలు పై నివేదికలను సంబంధిత అధికారులకు పంపించాలని అన్నారు.
2021 జనగణన పై జిల్లా లో సన్నద్ధత, జీవిఎంసీ, గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ పరిధిలో జరుగుతున్న సన్నాహక పనుల పై సమీక్షించారు.జనగణన నిమిత్తం నిధుల అవసరం, వాటి వినియోగంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత విభాగాధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఆర్. గోవింద రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.

(Visited 81 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *