తగరంపూడి శారదా నది లో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసిన విఆర్ఒ.

అనకాపల్లి :

మండలం లోని తగరంపూడి గ్రామంలో యదేక్చగా శారదా నది నుండి బెల్లం పెనాలు ద్వారా ఇసుక ను అక్రమంగా తరలించడం పై అనకాపల్లి తహసీల్దారు గంగాధరరావు కి గ్రామస్థులు పిర్యాదు చెయ్యడంతో గురువారం తగరంపూడి విఆర్ఒ శ్రీనివాసరావు జెసిబి తో శారదా నది లోకి వాహనాలు వెళ్లకుండా భారీ ట్రెంచ్ ఏర్పాటు చేసారు. ఇదిలా ఉండగా ఇదివరలో పలుమార్లు ట్రెంచ్ కొట్టినా ఇసుక దొంగలు ఈ ట్రెంచ్ ని పూడ్చి యధాతధంగా ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని పలువురు గ్రామస్థులు తహసీల్దారు కి పిర్యాదు చెయ్యడం తో అక్రమ ఇసుకను తరలించె వారిపై పోలీసు కేసులు పెట్టాలని తహసీల్దారు ఆదేశించారు అలాగే బెల్లం పెనాలకు కన్నాలు పెట్టాలని తహసీల్దారు ఆదేశించారు. స్దానిక సర్పంచ్ ప్రోద్బలంతో ఈ ఇసుక దందా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా విఆర్ఒ శ్రీనివాసరావు మాట్లాడుతూ రీ సర్వే కారణంగా బిజీగా ఉన్న సమయాన్ని చూసుకుని తగరంపూడి గ్రామానికి చెందిన కొందరు శారదా నది లో ఇసుకను బెల్లం పెనాలు ద్వారా ఒడ్డుకు చేర్చి అటు పై ఎడ్ల బండి ద్వారా చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ల అమ్ముతున్నట్లు తెలిసిందని అన్నారు. మా ఒక్కరి వల్ల ఇక్కడ అక్రమ ఇసుక రవాణాను కట్టడి చెయ్యలేమని పోలీసులు సహకరిస్తే అక్రమ ఇసుక కట్టడి అవుతాదని విఆర్ఒ అభిప్రాయ పడ్డారు ‌

(Visited 121 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.