పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయ‌వ‌ద్దు

జిఒ నెంబరు 2 విడుదల చెయ్యడం వలన పంచాయతి రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చెయ్యడమే నని పంచాయతి రాజ్ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. సోమవారం ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబరు 2 ను ఉపసంహరణ చెయ్యాలని జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ని సోమవారం పంచాయతి రాజ్ ఉద్యోగులు కలసి ఒక వినతిపత్రం అందజేసినారు.గ్రామ సచివాలయ వ్యవస్థ ను,గ్రామ వాలెంటరి వ్యవస్థ లను ఏర్పాటు చెయ్యడం ఆనంద దాయకమని అయితే ప్రస్తుతం విడుదల చేసిన జిఒ నెంబరు2 వలన పంచాయతి రాజ్ శాఖ ఉద్యోగుల హక్కును కాలరాసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ విధానాలకు మేము వ్యతిరేకం కాదని దీనివల్ల సంక్షేమ పధకాలు అమలు పరచడంలో జాప్యం జరుగుతాయని ఉద్యోగులు అన్నారు. తక్షణమే జిఒ ని ఉపసంహరించుకోవాలని మంత్రి అవంతిని కోరారు.ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో హరి ప్రసాద్,బి.శ్రీనివాసరావు,ఎం.పోలి నాయుడు,కరుణాకర్, పంచాయ‌తీరాజ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

(Visited 209 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *