అంగరంగ వైభవంగా సీతారామకళ్యాణం


విజ‌య‌న‌గ‌రం :ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో శ్రీసీతారామకళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవాలయం ప్రధాన అర్చకులు చాణక్య, శ్రీహర్ష, మహర్షిల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ సీతారాములకు కళ్యాణమహోత్సవం కన్నులపండువగా గావించారు. తొలుత స్నపనము, పంచామృతాభిషేకాలు, అర్చన గావించారు. ఈ ఉత్సవంలో ఎన్‌ సి ఎస్‌ ట్రస్ట్‌సభ్యులు నారాయణం శ్రీనివాస్‌, నీరజవల్లి దంపతులు, శ్రీనివాసరాజు, ఎం వి రమణ తదితరులు పాల్గొన్నారు.

(Visited 18 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *