స్టోన్ క్రషర్ నిర్మాణపనులు ఆపాల్సిందే

సీపీఐ, ఏఐవైఎఫ్ డిమాండ్.
డిప్యూటీ తహశీల్దార్కు వినతి


అనకాపల్లి : మండలంలోని సుందరయ్యపేట గ్రామంలో ఆంద్రప్రదేశ్ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) యాక్ట్ 2006 అనుసరించి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న స్టోన్ క్రషర్ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాల్సిందేనని సీపీఐ, ఏఐ.వై.ఎఫ్. ల ప్రతినిధులు సోమవారం అధికారులును కోరారు. ఈ మేరకు అనకాపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ వెంకట్ కు గ్రామస్తుల సంతకాలుతో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐనాయకులు కోన లక్ష్మణ, ఏఐవైఎఫ్ నాయకులు వియ్యపు రాజు మాట్లాడుతూ సీతానగరం రెవెన్యూపరిధిలో సర్వే నెంబర్ 270లో శ్రీనివాస్ చౌదరి భారీస్టోన్ క్రషర్ నిర్మాణ పనులు చేస్తూన్నారన్నారు. వీటికి ప్రజాభిప్రాయ సేకరణ కానీ, గ్రామసభ తీర్మానం లేదన్నారు. రెవెన్యూ డివిజన్అధికారి,(ఆర్డివో)అనుమతులు లేవన్నారు ఈ సర్వే నెంబర్ 270 గ్రామ1బిప్రకారం వ్యవసాయ భూమిగా నమోదైందన్నారు. ఈ భూమి సమీపంలో ఉన్న రైతులు భూములు, వ్యవసాయం దెబ్బతిని రైతులు జీవనాధారమైన రాజు చెరువు కాలక్రమంలో దెబ్బతింటుందని, దానిపై ఆధారపడిన ఆయకట్టు రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు,
*ఇప్పటికి ఉన్న స్టోన్ క్రషర్ వల్ల మెండుపాలెం 22 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయారన్నారు. మరో 5గురు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి స్టోన్ క్రషర్ నిర్మాణ పనులు అపి విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోని సాగు రైతులు పర్యావరణప్రమాదంలో పడ్డకుండా చూడాలని, గ్రామస్తులు అభ్యంతరాలు లెక్కచేయకుండా చేసే నిర్మాణాలకు యాజమాన్యం, సంబందిత అధికారులు భాద్యతవహించ వలసి ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డొక్కరి హరీష్, చొప్పా హరీష్ తదితరులుపాల్గొన్నారు.

(Visited 261 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *