కక్ష సాధింపు ఆపండి

కరోనా పై దృష్టి పెట్టండి – ఎమ్మెల్సీ నాగ జగదీష్

కరోనా వైరస్ సునామీలా రాష్ట్ర ప్రజలపై దాడి చేస్తుంటే వైసిపి పాలకులు తెలుగుదేశం నేతల పై దాడి చేస్తున్నారని శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బద్ద నాగ జగదీశ్వరరావు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కరోనా ప్రారంభం నుండి సంవత్సరం కాలముగా నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చూడ్డం వల్ల ఈ రోజు రెండో దశ సునామీలా మరణమృదంగం మోగిస్తుందని వైరస్ నివారణ చర్యలకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలను ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రికి తెలియకపోవడం విచారకరం. విశాఖ జిల్లాలో వైరస్ విజృంభిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో తగిన విధంగా వెంటిలేషన్ లు ఆక్సిజన్ బెడ్లు తగిన మందులు లేకపోవడం వల్ల వైరస్ బాధితులు గంటల తరబడి ఆసుపత్రి ముందు రోగులతో కుటుంబ సభ్యులు ఎదురు చూడవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తిలా పైశాచిక ఆనందం తో తెలుగుదేశం పార్టీపై నాయకులఎప్పుడు భవనాల ను కూల్చాలని ఏ నాయకుని జైలుకు పంపాలని ఆలోచన తప్ప ప్రజలు పిట్టల్లా చనిపోతుంటే దొంగ లెక్కలతో మభ్యపెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వైరస్ అంతగా లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని జగదీష్ విమర్శించారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్టణం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చెందిన భవనానికి జీవీఎంసీ లో అన్ని విధాలుగా ప్లాన్ తీసుకొని నిర్మాణం ప్రారంభించి ఐదు నెలలు అయిన తరువాత దొంగలు పడ్డ ఆరు నెలలకు జీవీఎంసీ అధికారులు స్పందించి శుక్రవారం అర్ధరాత్రి వందల మంది పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేయడం అన్యాయమని రాజకీయ నాయకుల ఎంతఒత్తిడి ఉన్నప్పటికీ ప్లాన్ తీసుకున్నా తరువాత నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా కక్ష సాధింపుతో వైసిపి పార్టీ రావాలని గత సంవత్సరం నుండి ఒత్తిడి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధతతో విశ్వాసంతో పని చేస్తున్న వ్యక్తి పై పార్టీలోకి రాలేదని కక్ష పెంచుకొని భవనాన్ని కూల్చివేశారని వైసీపీలోకి వెళితే ఎన్ని భూకబ్జాలు చేసిన ఎంత ఆర్థిక నేరాలు చేసిన అటువంటి వారికి ఏ కేసులో ఉండవని తేటతెల్లం అవుతోందని నాగ జగదీష్ తెలిపారు

(Visited 223 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *