సంక్షోభంలో భవన నిర్మాణ రంగం

క్రెడాయ్ ఏపీ అధ్యక్షుడు రాజా శ్రీనివాస్


విశాఖపట్నం : కరోనా తో పాటు బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో భవన నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని క్రెడాయ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ బి. రాజా శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ఎన్ఏడీ కొత్త రోడ్ సమీపంలోని ఫెయిర్ ఫీల్డ్ మెరియట్ హోటల్ లో 23వ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పదవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితి నుండి గట్టెక్కించేందుకు తగు సహకారం అందివ్వాలని కోరారు. అనంత‌రం రెండేళ్లకు గాను కొత్త కార్యవర్గం ఎన్నుకొన్నారు.అనంతరం రాజా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఇసుకపై ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసినప్పటికీ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అది అమల్లోకి వచ్చాక గానీ ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందో చెప్పలేమన్నారు,స్టీలు, సిమెంట్ ధరలు పెరిగిపోయాయని లేబర్ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బిల్డప్ ఏరియాలో 10 శాతం మార్టిగేజ్ చేసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు.బ్యాంకు వడ్డీలు పెరిగిపోతున్నాయని వాయిదాలు చెల్లించలేని పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని భవన నిర్మాణ దారులు అన్ని రకాల ఫీజులు ఒకేసారి చెల్లింపు పద్ధతికి స్వస్తి పలికి ఇతర రాష్ట్రాల మాదిరిగా నాలుగు వాయిదాలు ఇవ్వాలని కోరారు.కోవిద్ నేపథ్యంలో ఒక ఏడాది పాటు బ్యాంకులు ఆర్ధిక వెసులుబాటు ఇచ్చినప్పటికీ మళ్లీ ఒత్తిడి తప్పడం లేదన్నారు.లైసెన్స్ ఫీజులు, ఇతరత్రా పన్నులు చెల్లింపు విషయమై ప్రభుత్వం తగు వెసులుబాటు కల్పించాలని కోరారు.ప్రభుత్వం భవన నిర్మాణ దారులను ఆదుకోవాలని క్రెడాయ్ ఏపీ చైర్మన్ ఎస్. వెంకట్రామయ్య కోరారు.ప రాష్ట్రంలోని 20 పట్టణాల్లో క్రెడాయ్ చాప్టర్లు ఉన్నాయని వెయ్యి మందికి పైగా సభ్యులు ఉన్నారని చెప్పారు ప్రభుత్వ విధానాల వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి ఉంటోందని, స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చెప్పారు.ఈ సమావేశంలో క్రెడాయ్ ఏపీ ఉపాధ్యక్షులు పి రాజశేఖర రావు,వై.వీ. రమణారావు, ఎస్ వి ఎం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి కే సుభాష్ చంద్రబోస్,కోశాధికారి డి.రాంబాబు, జాయింట్ సెక్రటరీలు పీలా కోటేశ్వరరావు, ఎన్ వి ఎస్ రామకృష్ణ,జి రాజేంద్ర రావు మరియు సాయి రాజు పాల్గొన్నారు.

(Visited 35 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *