గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలకు స‌హ‌క‌రించండి

అన‌కాప‌ల్లి : గ్రామీణ విద్యుత్ సహకార సంస్థల మనుగడకు అవసరమైన అనుమతులను ఇవ్వాల‌ని కోరుతూ ప్రజా రాజకీయ వేదిక స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారికి విన‌తిప‌త్రం అంద‌జేసింది.ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రముఖ గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం హమీ ఇవ్వని కారణంగా ఏపీ.ఈపీ.డీసిఎల్ వారిని ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 కు గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీ చేసే విధులను టేక్ ఓవర్ చేసుకోమని ఆర్డర్ లను తేదీ 25-03-2021 నాడు మంజూరు చేయటం జరిగినది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గౌరవ ఆర్.డి.ఓ కు తెలిపారు.
గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీల వల్లన గ్రామీణ ప్రాంత ప్రజలకు కారుచౌకగా విద్యుత్ ను ఇవ్వవచ్చునని యాజమాన్యాల స్వార్ధపూరిత వైఖరులు మూలంగా ఏపీ.ఈపీ.డిసిఎల్ తో సమానంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు, దీనిని సవరించాలని పూర్తిస్థాయి పర్యవేక్షణలో గ్రామీణ విద్యుత్ సహకార సొషైటీలను ఉద్దరించాలని, వాటికి అవసరమైన అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చి గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీల ద్వారానే విద్యుత్ సరఫరాను కొనసాగించాలని ఆర్.డి.ఓ గారిని కోరామని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వాడ వాసు, మళ్ళ చక్రవర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

(Visited 86 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *