అక్ష‌ర య‌జ్ఞంలో తానా

అనన్య సామాన్య అక్షర యజ్ఞాన్ని అప్రతిహతంగా గావించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)

షడ్రుచుల సమ్మేళనం తెలుగు భాష. తెలుగు భాషకు సొగసు .. తెలుగు మాటకు శ్రావ్యత.. తెలుగు నుడికి వడి ఎక్కువ అని విజ్ఞులు చెప్పిన మాట నిజమే కదా.అమ్మ చేతి ముద్ద వంటి మృదుమధురమైన అక్షరానికి పట్టాభిషేకం జరిగింది. ప్రపంచ మహాకవి సమ్మేళనం పేరిట ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. విభిన్న రీతుల్లో కవిత్వ పరిమళం సాహితీ ప్రపంచాన్ని సుగంధభరితం గావించింది. గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు వారధి భాష. భాషతోనే అస్తిత్వం మాతృభాషలోనే భావోద్వేగం కలుగుతుంది.భాష కేవలం మాధ్యమమే కాదు .భాష జ్ఞానాన్ని, సంప్రదాయాన్ని, సంస్కృతిని వారసత్వంగా ఒక తరం నుండి మరోతరంకు చేరవేస్తుంది.భాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం. తెలుగు భాషకు సేదతీర్చి స్వాంతన కూర్చి గత ప్రాభవ పునరుద్ధరణకు నడుం బిగించిన తానా నిర్వాహకులు చరితార్థులు.
ప్రపంచ మహా కవి సమ్మేళనం ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన శాంతా బయోటెక్స్‌ అధినేత పద్మభూషణ్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ 21 దేశాలోని తెలుగు సంఘాలను సమన్వయపరుస్తూ , తెలుగు వారి సమైక్యతా శక్తిని, బలాన్ని, భాషా వైభవాన్ని , సాహిత్యపరిమళాన్ని ప్రపంచానికి చాటడానికి తానా
అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్‌, తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌, తానా మహిళా సమన్వయకర్త తూనుగుంట్ల శిరీషలు చేపట్టిన బృహత్తర యజ్ఞఫలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానుకు దక్కిందని అన్నారు. అజంత భాష, అమృతభాష అయిన తెలుగుకు మరే ఇతర భాషలుకు లేని సొగసు వుందని, ప్రత్యేక క్షణాలను సంతరించుకుని ఉందని, ఆదికవి నన్నయ్య, తిక్కన, సోమనాథుడు, బమ్మెర పోతన వంటి కవుల నుండి తరువాత తరాలకు చెందిన విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి వంటి మహనీయులు తమ ప్రతిభా వ్యుత్పత్తులతో తెలుగు భాషా సాహిత్యాను పరిపుష్టం గావించగా నేడు ఆ సంప్రదాయాన్ని తానా పుణికిపుచ్చుకుందని అన్నారు. ఆస్వాదించాల్సిన అమ్మభాషను కఠినతరం చేసి పిల్లలకు దూరం చేసే
విషయాల కు స్వస్తి చెప్పాలని, తెలుగుకు వెయ్యేళ్లకు పైగా సాహిత్య పరిణామం వుందని,భాషకు జీవాన్ని అందించి సాహిత్యానికి ప్రాణాన్ని పోసి పరిరక్షించుకునే దిశలో ప్రయత్నం జరగాలని అన్నారు.
సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి అనే సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్‌, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్‌ వెంకట ప్రతాప్‌, ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి, ఒమన్‌లోని తెలుగు కళాసమితి అధ్యక్షులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ కడిరచర్ల, ఖతర్‌లోని తెలుగు కళాసమితి అధ్యక్షులు తాతాజీ ఉశిరిక, కువైట్‌లోని తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు, సౌదీ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షులు దీపికా రావి, బెహ్రయిన్‌ తెలుగు కళాసమితి అధ్యక్షులు శివ, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఆఫ్రికా అధ్యక్షులు యెలిగేటి వేణుమాధవ్‌, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ బోట్సవానా తెలుగు సంఘం అధ్యక్షులు మహేంద్ర అన్నపూర్ణ, ఫిన్‌లాండ్‌ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు నడిరపల్లి మధుకృష్ణంరాజు, డెన్మార్క్‌ తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్‌ శివప్రసాదరెడ్డి మద్దిరా, నార్వే తెలుగు సంఘం అధ్యక్షులు తారకేష్‌ కాండ్రేగు, నార్తెన్‌ ఐర్లాండ్‌ తెలుగు సంఘం అధ్యక్షులు రమేష్‌ గుమ్మడవెల్లి, యు.కె.లోని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ అధ్యక్షురాలు భారతి కందుకూరి, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌ అధ్యక్షులు శివ చింపిరి, న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షులు మగత శ్రీత, ఆస్ట్రేలియాలోని తెలుగు మల్లి అధ్యక్షులు కొంచాడ రావు తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ చైనా సమన్వయకర్త అశోక్‌కుమార్‌ గుప్తా ఈ బృహత్తర యజ్ఞాన్ని దిగ్విజయమయ్యేందుకు సహాయ సహకారాలను అందించారు. ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగాను, ఈనాడు సి.ఇ.ఒ`విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌, సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌ రెడ్డి, మన తెలంగాణా పత్రిక ఎడిటోరియల్‌ ఎడ్వయిజర్‌ గార శ్రీరామమూర్తి హాజరై తమ సందేశాను అందించారు.

అమ్మభాష ఎంతో తియ్యన. ప్రేమ చెమ్మ తగిలిన రుచులూరే గోరుముద్ద బువ్వ. తెలుగు భాషా పునాదులకు మరింత బలాన్ని అందించి మకరందాల ఊటలను రేపటి తరానికి భాషాభిమానులకు అందించే వేదికగా నిలిచింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా). మాతృభాషపట్ల అనురక్తిని పెంపొందింపచేయడం, సమష్టి భావాల సమాగమం తెలుగు. సంస్కృతిని పరిరక్షించడం వంటి సదుద్దేశ్యంతో తానా చేపట్టిన మహాకవిసమ్మేళనం 100 శాతం విజయవంతమైందని చెప్పవచ్చు.

(Visited 19 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *