ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయ సమస్యలు

మాజీ ఎమ్మెల్సీ, పిఆర్టియు రాష్ట్ర నేత గాదె శ్రీనివాసులు

అనకాప‌ల్లి రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడు అన్నారు. అనకాపల్లి లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపరంగా ఎదురైన ఆటంకాలను పరిష్కరించి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించాలని ఆయన కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించి ఉపాధ్యాయులందరికీ కేడర్ పదోన్నతులు కల్పించారు. రాష్ట్రంలో సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు.
వెంటనే నివేదిక రప్పించుకొని రాష్ట్రంలో నూతన వేతన సవరణ (పిఆర్సి) అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలతో పాఠశాలలో నమోదులు బాగా పెరిగే అన్నారు. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుడు నిర్మించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల పై యాప్ల ఒత్తిడి తగ్గించి పూర్తి సమయాన్ని బోధన కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యాప్లు, సెల్ఫోన్ల నిర్వహణ బాధ్యత అంతా గ్రామ వార్డు సచివాలయం కి అప్పగించాలన్నారు. పి ఆర్ టి యు నాయక్ నాయకులు డీజీ నాద్, బుద్ధ కాశీ విశ్వేశ్వర రావు, పి ఆర్ వి మహేశ్వరరావు, జి అప్పారావు శంకర్ బాబు, రవి, శ్రీనివాస్, చ‌క్ర‌వ‌ర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

(Visited 87 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *