అడ్డంగా దొరికిపోయిన తహశీల్దారు
*రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి దారాదత్తం
*22 ఏ లో ఉండగానే వెబ్ లాండ్ లో ఆతుకుబడి పట్టా గా నమోదు
*తిరగబడిన గ్రామస్తులు
*హడావిడిగా రికార్డుల సవరణ
ఆక్రమణ గెడ్డ వాగు భూమిలో ప్లాట్ లు వేసిన రెవెన్యూ అధికారులు
అనకాపల్లి: కాసులకు కక్కుర్తిపడి జంకు బొంకు లేకుండా ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసి అడ్డంగా దొరికిపోయిన తహశీల్దారు వైనం ఇది. కోట్లాది రూపాయల భూమిని ఉన్నతాధికారులకు తెలియకుండా, దిగువ స్థాయి ఉద్యోగులకు కూడా తెలియకుండా చేతివాటం చూపిన కశింకోట తహశీల్దారు చేసిన ఘనకార్యం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కశింకోట మండలం ఉగ్గిన పాలెం రెవెన్యూ సర్వే నెంబరు 88/1లో 2.50 ఎకరాలు గెడ్డ వాగు ఉంది .ఈ భూమిని ని పరవాడ పాలెం గ్రామానికి చెందిన బలిజ ముసలినాయుడు చాలా కాలంగా ఆక్రమించుకొని ఫల సాయాన్ని అనుభవిస్తున్నాడు. దీనిపై 2015లో గ్రామస్తులు అప్పటి తహశిల్దార్ కు ఫిర్యాదు చేశారు. అలాగే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణ స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. ఆక్రమణ దారుడు సదరు భూముల్లో నీలగిరి చెట్లు వేసి ఉన్నాడు. వాటిని తొలగించడానికి 31 -7 -2017 నుండి 30-1-18 వరకు అనగా ఆరు నెలలు సమయం ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అప్పటి అదనపు ఎస్సై తాకాశి నర్సింగరావు, ఎస్ఐ సన్యాసిరావు, కశింకోట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తదితరులు న్యాయస్థానం ఇచ్చిన ఆరు నెలల కాలంలో ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆక్రమణ దారుని ఆదేశించారు. అయితే ఆక్రమణ దారుడు ముసిలి నాయుడు గడువు ముగిసినా ప్రభుత్వ భూమిని ఖాళీ చేయకపోవడంతో గ్రామస్తులు మరోమారు కశింకోట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా సదరు ఆక్రమణ స్థలం పోలవరం కాలవ స్థల సేకరణలో ఉంది. దీంతో ఆక్రమణదారుని కన్ను ఈ భూమికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం పై పడింది. అంతే ముసిలి నాయుడు తాహశిల్దారు తో కుమ్మకై ఇద్దరూ కలిసి మహా స్కెచ్ ను రడీ చేశారు. గ్రామస్తులకు ఆక్రమణ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అదే స్థలంలో కొన్ని ప్లాట్లకు రాళ్లను పాతి గ్రామస్తులకు అనుమానం రాకుండా జాగ్రత పడ్డారు. తనకు సదరు భూమిపై వచ్చే మూడు కోట్ల రూపాయ వస్తే 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ముందుగా రెండు లక్షల రూపాయలు అడ్వాన్సుగా చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో దీనిని అతుకు బడి పట్టా గా వెబ్ లాండ్ లో నమోదు చేసి వన్ బి లో ఈ ఏడాది మే 25వ తేదీన 29 79 ఖాతా నంబరు కూడా సృష్టించారు. విషయం గ్రామస్తులకు కు తెలిసిపోయింది ఉన్నత అధికారులకు తెలియకుండా దిగువస్థాయి సిబ్బంది నివేదికలు లేకుండా అడ్డగోలుగా ప్రభుత్వ రికార్డులను మార్చేసిన తహశీల్దారు పై జుడిషియల్ ఎంక్వయిరీ వెయ్యాలని గ్రామానికి చెందిన గొంతెన శివ గొంతెన లోవ అప్పారావు లు డిమాండ్ చేస్తున్నారు.
గెడ్డలు, వాగులు ఆక్రమించడం నేరమని అలాగే 1954 బోర్డు ఆప్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కిన తాసిల్దార్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 22 ఎ లో గాని, అసైన్డ్ ల్యాండ్ రిజిస్టర్ లో గాని బలిజ ముసిలి నాయుడుకి భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. అంతేకాకుండా సర్వే నెంబర్ 88 సబ్ డివిజన్ కూడా కాలేదు అలాగే 22 a లో గాని,ఎప్.ఎం.బి.లో గాని సబ్ డివిజన్ అయినట్టుగా చూపించడం లేదు.. మరి అలాంటప్పుడు వెబ్ లాండ్ లో 88/1 లో 2.50 సెంట్లు గా ఆన్ లైన్ చేసి 2979 ఖాతా నెంబరు ఎలా ఇచ్చారో ఉన్నతాధికారులకు తహసీల్దారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. గడ్డలు వాగులు ఆక్రమణ చేయడం 1954 లో బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కిన రెవెన్యూ అధికారుల పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు అవసరమైతే తాసిల్దార్ సుధాకర్ పై సి సి ఎల్ కి ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమని గ్రామస్తులు తెలిపారు కాగా తాసిల్దార్ కార్యాలయంలో మణికంఠ వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్ గా నియమించుకొని అతని ద్వారానే అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
తహశీల్దారు సుధాకార్ చాంబర్ ని ముట్టడించిన గ్రామస్తులు (పైల్ ఫొటో)
తహశీల్దారు వివరణ:
ప్రభుత్వ భూమిని ఆక్రమణదారునికి దారాదత్తం చేయడం పట్ల తహసిల్దార్ సుధాకర్ ని ‘వీడ్రీమ్స్’ వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని ఈనెల పదవ తేదీన ఆక్రమణ దారుని పేరు రెవెన్యూ రికార్డుల నుండి డి తొలగించడం జరిగిందన్నారు. తహసిల్దార్ కు తెలియకుండా రెవెన్యూ రికార్డుల్లో కి ఆక్రమణ దారుని పేరు ఎలా ఎక్కిందని ప్రశ్నించగా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదం వల్ల జరిగిందని అన్నారు. మరి అతనిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా విచారణ జరుపుతామని అన్నారు మీరు 20 లక్షలు ఆశించారు అని గ్రామస్థులు నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయని ప్రశ్నించగా జవాబు దాటవేశారు.
సుధాకర్ పై విచారణ చేయాలి :గొంతిన శివ అప్పారావు పరవాడ పాలెం
సర్వే నెంబర్ 88 మీద అనేకమార్లు కశింకోట తహశీల్దారు కు అలాగే జిల్లా కలెక్టర్‌కి గ్రామస్తులు అందరూ కలసి పిర్యాదు చేసి ఉన్నామని అయితే పోలవారం కాలవ లో సర్వే నెంబర్ 88 పోతుండటంతో ఆక్రమణదారుడు బలిజ ముసిలి నాయుడు కశింకోట తహశీల్దారు సుధాకర్ తో బేరం కుదుర్చుకుని ప్రభుత్వ భూమిని ముసిలి నాయుడు పేరుమీద వన్ బి నెంబర్ 29 79 ఖాతా తో వెబ్ లాండ్ లో ఎక్కించారని అవినీతికి పాల్పడిన తహశీల్దారు సుధాకర్ పై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి తగిన చర్యలు తీసుకోవాలి.