ఆమెను గెలిపించిన ప‌రుగు జీవితాన్ని .. మార్చిన ప‌రుగు

ఒక చివ‌ర :
………..వేర్వేరు రంగాల‌కు
వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన ‌
ఇద్ద‌రు స్నేహితుల పుట్టిన్రోజు
మ‌రొక చివ‌ర :
ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి
ప్ర‌యాణించిన రోజు……….
ప్రేమ న‌మ్మ‌కం విశ్వాసం
ఈ మూడింటినీ న‌మ్ముకుని
నేను ప్ర‌యాణించాలి
మీరూ ఆ న‌మ్మ‌క‌మే న‌మ్ముకోవాలి

ఉద‌యం అక్క ప‌ల‌క‌రించి పోయారు
పేరు స్వాతి ఇంటి పేరు కొర‌పాటి

గోదావ‌రి ఆడ‌బిడ్డ నా ఇంటి బిడ్డ

మ‌ధ్యాహ్నం వేళ
ల‌తా భ‌గ‌వాన్ క‌రే ప‌రిచ‌యం అయ్యారు
ఎవ‌రు ఈమె?

ఆఫ్ట‌ర్ లంచ్

తిన్నాక చ‌దువు చ‌దివేక ప‌రుగు
అక్ష‌రాలా ప‌రుగు.. మార‌థాన్
అని అనాలె.. ఇలాంటి ప‌రుగులు
న‌మ్మేను చేశాను రాత్రి వేళ‌ల్లో
రాత ను న‌మ్ముకుని చేశాను
ఎంతో ఆనందించేను
మ‌ళ్లీ మొద‌టికి
నా ఇద్ద‌రు స్నేహితులు ఒక‌రు అచ్చెన్న ఒక‌రు ప్ర‌కాశ్ రాజ్
పుట్టిన్రోజులు నా ఇద్ద‌రు స్నేహితుల‌కూ జేజేలు
ఇద్ద‌రు స్నేహితులు న‌వీన్ దేశ‌బోయిన అర్ర‌బోతు కృష్ణ
తెలంగాణ బిడ్డ‌లు ఏం చేశారు?

ఈ – శుక్ర‌వారం : క‌రీంన‌గర్ కు పోవాలి ఎవ‌రా కుర్రాడు

డ‌బ్బులుంటే దాచుకోవాలి..డ‌బ్బులు లేకుంటే సంపాదించుకోవాలి..సంపాదించుకునే వ‌య‌స్సులోనే పేరు మ‌రియు కీర్తి సంపాదిం చి వెళ్లాలి..ఆ భ‌ర్తకూ ఈ భార్య‌కూ అవి తెలియ‌వు. మ‌హారాష్ట్ర‌కు చెందిన క‌థ ఇది. బారామ‌తి ప్రాంతానికి చెందిన క‌థ ఇది. ఈ క‌థ ‌కూ నాకూ ఎటువంటి సంబంధంలేదు..ఆలోచిస్తే తేలదు కూడా! ఈ క‌థ‌లో నీతి క‌న్నా నిజాయితీని ప్రేమించాను. కొన్ని క‌థ‌లు నీ తికి ఆన‌వాళ్లు కొన్ని క‌థ‌లు నిజాయితీకి ద‌ర్ప‌ణాలు..అని భావిస్తాను నేను.

.……………అవార్డు చేదు
అభినంద‌న తీపి కొన్నిసార్లు
అవార్డులేవో వ‌స్తాయి. అవార్డులు ఏవో సాహిత్యానికీ అవార్డులు ఏవో సంగీతానికీ అవార్డులు ఏవో సినిమాల‌కూ వ‌చ్చిపోతాయి..
వ‌చ్చే వాటిని నేను ప‌ట్టించుకోను. అలాంటి ప‌ట్టింపు వ‌ల్ల ఒన‌గూరేదేమీ లేదు.. సినిమాలు కూడా అలాంటివే! నా న‌మ్మ‌కానికి అవి ప్ర‌తినిధిగా ఉండ‌వు. నా విశ్వాసాల‌ను అవి బ‌ల‌ప‌ర్చ‌కున్నా క‌నీసం ప్ర‌క‌టించ‌వు కూడా! కానీ తెలంగాణ బిడ్డ‌లు మాత్రం నా వ‌ర‌కూ భ‌లే న‌చ్చుతారు.. వారు ప్ర‌య‌త్నంలో నిజాయితీని ప్రేమించి వెళ్లిపోతారు.. పాట రాస్తానా ప్రేమిస్తారు.. మాట చెప్తానా విం టారు..ఇలాంటి వినే చెవి ఒక‌టి న‌వీన్ దేశ‌బోయినది..ఆయ‌న ఒక క‌థ‌ను ప్రాణం ఆపాదించాడు. కాదు ప్రాణం ఉన్న క‌థ‌కు తెర రూపం ఇచ్చి అవార్డు అందుకోనున్నాడు. జ‌ర్న‌లిస్టు న‌వీన్ .. యాక్టివిస్టు న‌వీన్ అవునో కాదో కానీ డైర‌క్ట‌రుగా ఈయ‌న ఒక సిని మాను రూపొందించి అవార్డు తెచ్చాడు తెలంగాణ వాకిట‌కు.. చెప్పానుగా ఇది నిజాయితీ అందుకే న‌చ్చింది.. క‌థను సినిమా భా ష‌లో ట్రాన్స్ ఫార్మ్ చేయ‌డంలో లేదా క‌థ‌‌కు ప్రాణం అందించ‌డంలో నిజాయితీనే చూడాలి చూస్తాను మీరూ అదే ప‌నిచేయాలి. క థేంటి?కాక‌ర‌కా య ఏంటి ఇలాంటివి రాయ‌ను..కానీ చేదును తీపిగా మ‌లిచిన సంద‌ర్భం ఒక‌టి చెప్తాను.
ఆమెను గెలిపించిన ప‌రుగు
జీవితాన్ని .. మార్చిన ప‌రుగు
ముందే చెప్పాను..ల‌తా భ‌గ‌వ‌న్ క‌రే..బీద ఇంటి బిడ్డ.. ముగ్గురు పిల్ల‌ల త‌ల్లి.. భ‌ర్త కు అనారోగ్యం.హృద్రోగి..బిడ్డ‌లంతా చెట్టూ పుట్టా వెతుకుతూ పోయారు..చెట్టు నీడలు కొన్ని వెతుకుతూ పోయారు.. కానీ త‌ల్లీ తండ్రీ అనే చెట్టు నీడ‌ల‌ను మాత్రం మ‌రిచిపోయా రు. ముగ్గురూ కూతుళ్లే..భ‌ర్త‌ను కాపాడుకోవాలి..భ‌ర్త ఆశ‌లకు తిరిగి ప్రాణం పోయాలి.. ఆనందం అందించాలి. బ‌త‌కాలి బ‌తికించాలి అన్న‌వి ఉన్నాయి.. తాను బ‌త‌కాలి.. భ‌ర్త‌ను బ‌తికించాలి.. ఈ క‌థ‌లో ఆమె నిజాయితీతో చేసిన ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోవాలి.. లేదా సంక‌ల్పం ఒక‌టి గెలిచిన తీరు మెచ్చుకోవాలి..భ‌ర్త కోసం ప‌రుగులు తీసింది.. భ‌ర్త ఆరోగ్యం బాగుంటే చాలు అని అనుకుని మార‌థాన్ లో పాల్గొని అంద‌రి మ‌నస్సులూ గెల్చుకుంది. త‌న‌కు కావాల్సింది ఐదంటే ఐదు వేలు భ‌ర్త ప్రాథ‌మిక ఆర్యోగ ప‌రీక్ష‌ల నిమిత్తం.. ఆమె క‌ష్టం తెల్సుకుని లోకం అండ‌గా నిలిచింది. ఏ క‌ష్టం అయినా ఏ క‌న్నీరు అయినా మ‌నిషి జీవితాల‌ను ప్ర‌భావితం
చేసే తీరే సంక‌ల్పానికి ఆధారం అవుతుంది.. దృఢ‌‌మయిన మ‌నుషులు వెత‌కాలి లేదా ఇలాంటి మ‌నుషులే ఆద‌ర్శం కావాలి..ఈ క‌థ‌తో సినిమా.. ఈ క‌థే సినిమా..ఆమెతోనే న‌టింప‌జేశారు న‌వీన్ .. అవార్డు.. జాతీయ అవార్డు తెలంగాణ వాకిట‌కు..అవార్డులే మ‌యినా కొల‌మానాలా ? కాదు కానీ ఈ ప‌రుగే మ‌నిషిని గెలిపించేందుకు అవ‌స‌రం అని ప్ర‌క‌టించేందుకు ఓ ఆధారం.
ఆనందించాలి నేను
ఆనందించాలి మీరు
మ‌నిషి పరుగులో గెలిచాడు .. ఒక మ‌నిషి ప‌రుగు మ‌రో మ‌నిషి ని గెలిపించి నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నాల‌కు అంద‌లం ద ‌క్కించేలా చేసింది. అవార్డు మ‌హేశ్ బాబు కు నచ్చ‌లే అవార్డు మరెవ్వ‌రికో న‌చ్చలే.. అవార్డు ఈ బంగరు త‌ల్లికి న‌చ్చింది..ఈ అ వార్డు బంగ‌రు బిడ్డ‌ల క‌ల‌ల సాకారానికి న‌చ్చింది.. న‌వీన్ అను భ‌య్యా నీకు ఓ కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య‌వాద.. కొన్ని మాత్ర‌మే అవార్డు స్థాయిని పెంచేలా చేస్తాయి.. లేదా వాటి విలువ‌ను చాటింపు వేస్తాయి..దేశ రాజ‌ధానికి ఇలాంటి క‌థ ఒక‌టి త‌ప్ప‌క చేరాలి మ‌రొక్క సారి..


:- పునః క‌థ‌నం : ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
:- విష‌య ఆధారం : సాక్షి ఫ్యామిలీ

(Visited 91 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *