దేశంలో దొంగ‌ల పాల‌న‌

మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు తీవ్ర విమ‌ర్శ‌లు


దేశంలో ఏ రాష్ట్రంలో జరగని దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఒక్కసారి కళ్లుతెరచి చూడండి రా బాబు అంటున్న మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్, అలిబాబా 40 దొంగల లాగా జగన్ బాబా 40 దొంగలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ అయ్యన్న మండిపడ్డారు. పోలవరం రివర్స్ టెండరింగ్ లో జగన్ రెడ్డి దారుణంగా దోచుకుంటున్నారు. శుక్ర‌వారం విలేకరులకు పంపిన వీడియోలో మాజీమంత్రి అయ్యన్న ప్రజలు మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ మీ పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది అని ఆలోచించ లేకపోతున్నారంటూ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డికి కమిషన్ మీద వున్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యడంలో లేకపోవడం ఆంధ్ర ప్రజల దరదుష్టకరం. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టి అధికారులను పరుగులెత్తించి మరి వేగంగా నిర్మాణం పనులు చేయించారు.

పనులు ఎంతవరకు జరుగుతున్నది ప్రజలందరూ అక్కడకు వెళ్లి చూడడంకూడా జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరుతో 780కోట్లు ఆదాచేసాం అని గొప్పగా డబ్బా కొట్టుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం 3 వేల222కోట్లు పెంచేసి దొడ్డిదారిన దోచుకున్న విషయం ప్రజలు అందరూ గమనించాల్సి ఉంది.
ఇప్పటికే ఇసుక,మద్యం,నిత్యావసర వస్తువుల రేట్లు పెంపు, ఆఖరికి ఇళ్ల పట్టాలు పంపిణీలో కూడా మీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు అన్నం పెట్టే రైతులకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కూడా దోచుకోవాల జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.

(Visited 111 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *