కోవిడ్‌తో ఇద్ద‌రు జ‌ర్నలిస్టుల మృతి


జిల్లాలో ఇద్ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు గురువారం మృతి చెందారు. క‌రోనాతో బాధ‌ప‌డుతూ వీరిద్ద‌రూ తుదిశ్వాస విడిచిచారు. సాక్షి విశాఖ కేజేహెచ్ విభాగం చూసే అచ్చిరాజు, అన‌కాప‌ల్లి కి చెందిన‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, అన‌కాప‌ల్లి ప్రెస్‌క్లబ్ అధ్య‌క్షుడు వెంక‌ట్రావు మృతి చెంద‌డం జ‌ర్న‌లిస్ట్ వ‌ర్గాలు తీవ్ర షాక్ కు గురయ్యారు. వీరిద్ద‌రూ కూడా ఎవ‌రికి ఆరోగ్యం బాగోలేక‌పోయినా వెంట‌నే స్పందించ‌డం, త‌మ‌కున్న ప‌రిచ‌యాలు మేర‌కు వైద్యుల‌తో మాట్లాడి మెరుగైన వైద్యం ఇప్పించ‌డంలో ఎంద‌రికో సాయం చేశారు. వెంక‌ట్రావు అయితే రోజూ ఎన్టీఆర్ ఆస్ప‌త్రిలో క‌నీసం రెండు గంట‌లైనా ఉండి సాయం కోసం వ‌చ్చే వారికి పెద్ద దిక్కుగా ఉండేవారు. అన‌కాప‌ల్లి జ‌ర్న‌లిస్టుల అందిరికీ ఆప్తుడిగా..పిలిస్తే ప‌లికే నాయ‌కుడిగా ఉండేవారు. ఆయ‌న మృతి చెంద‌డంతో తోటి జ‌ర్న‌లిస్టులంతా తీవ్ర ఆందోళ‌న‌కు గురయ్యారు. అనకాపల్లి జర్నలిస్టు లకు ఇళ్ల స్థలాలు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, అనకాపల్లి ఎంపి సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్,మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ,మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి వైసిపి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకట్రావు అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులతో వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్ అధ్య‌క్షుడు గంట్ల శ్రీ‌నుబాబు, వీజేఎఫ్ ప్ర‌తినిధులు దుర్గారావు, నాగ‌రాజు ప‌ట్నాయిక్‌, ఎపీడబ్ల్యూజేఎఫ్ న‌గ‌ర అధ్య‌క్షుడు పి.నారాయ‌ణ త‌దిత‌రులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. జ‌ర్న‌లిస్టులు విధి నిర్వ‌హ‌ణ‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

(Visited 340 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *