షడ్రుచుల స్వాదు ప్రసాదం ఉగాది

– పువ్వల శ్రీనివాసరావు

షడ్రుచుల స్వాదు ప్రసాదం ఉగాది అని షద్రుతుల సారప్రసాదం ఉగాది అని అంజనీ ఫౌందేషన్‌ అధ్యక్షులు పువ్వలథ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉదయం విజయనగరంలో ఒక ప్రయివేటు అతిథి గృహంలో కంచర్ల ఫౌండేషన్‌,అలయన్స్‌క్షబ్‌, గీతాంజలి విద్యాసంస్థలు, గేట్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది పురస్కారమహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చిత్తశుద్ధితో సేవలందించేవారికి ప్రోత్సాహం మరింతఉత్సాహంతో సేవలందించడానికి బాగుంటుందని అన్నారు. ఈ ఉత్సవాన్ని గ్రంథి విష్ణుమూర్తి జ్యోతి ప్రజ్వలనం గావించిప్రారంభించారు. కార్పొరేటర్‌ పిన్నింటి కళావతి, కంచర్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్‌,అధ్యక్షులు కంచర్ల రాజేశ్వరరావు, గౌరీ శంకర్‌రావు, కామరాజు,గీతాంజలి శ్రీనివాస్‌లు కలసి 2021 సంవత్సరానికిగాను ఆధ్యాత్మిక రంగం నుండి కాకినాడకు చెందిన గోకులం వ్యవస్థాపకులు నారాయణం మురళి, సాయి సత్సంగసేవాసంఘం వ్యవస్థాపకులు ఉపద్రష్ట వరప్రసాద్‌, వైద్యరంగం నుండి డాక్టర్‌ ఎం జయచంద్రనాయుడు, డాక్టర్‌ జాడశ్రీకాంత్‌, దాక్టర్‌ గాడి ప్రసాద్‌, ఎన్‌.ఆర్‌.ఐ. ఆసుపత్రి, విద్యారంగం నుండి కె. భాగ్యలక్ష్మీ(డిమ్స్‌ కంప్యూటర్స్‌) సేవారంగంనుండి బి.శంకరనారాయణ, గుమ్ములూరి విశాలాక్షి భోగరాజు సూర్యలక్ష్మీ పిన్నింటి సూర్యనారాయణ, గురానఅయ్యలు, ఎం సుభద్రాదేవి, గోటేటి హిమబిందు, చొప్పల్లి సాయి సంతోషి శ్రావణ్యలకు పురస్కారాలను ప్రదానంచేసారు. పురస్మారాలును ప్రదానం చేసారు. ఈ సందర్భంగా ఉత్తమ ఎన్‌సిసి కేడిట్‌లకు ప్రశంసాపత్రాలను ప్రదానంచేసారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం విజయనగరం మండల శాఖ అధ్యక్షులు డోకి చంద్రశేఖర్‌, డిమ్స్‌ రాజు, సముద్రాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

(Visited 9 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *