ఆక్సిజన్ తరలింపునకు విమాన సేవల వినియోగం


                                                         (జి. సాయి ప్రసాద్, హైదరాబాద్)
కరోనా మరణాలను నియంత్రించడానికి సంజీవని లాంటి ఆక్సిజన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు రంగంలోకి దిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించేందుకు విమాన సేవలు ఉపయోగిస్తున్నారు.

నిజానికి పక్కనున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అవుతున్న ఆక్షిజన్ కు బదులు ఒరిస్సా ప్లాంట్ల నుంచి మోడీ ప్రభుత్వం తెలంగాణకు కోటా కేటాయించింది. అయితే రోడ్డు, రైల్ మార్గంలో తెలంగాణకు చేరేందుకు మూడు రోజులు రవాణాకు టైమ్ పడుతుంది.. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో మేధోమధనం జరిగింది. దానిలో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ తెచ్చేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక విమానాలు ఒరిస్సా కు రివ్వున ఎగిరి సంజీవని నిల్వలను తెచ్చేందుకు వెళ్లాయి.

(Visited 158 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *