మార్నింగ్ రాగా : వ‌కీల్ సాబ్ ఫిదా హోగ‌యా తుమ్

రైటర్ వేణు బాగున్నాడు
ఆయన పేరు చివర
శ్రీరాముడు ఇంకా బాగున్నాడు
అరణ్యంలోనూ అయోధ్యలోనూ
రాముడు బాగున్నంత బాగున్నాడు
ఆయనే అన్నాడు ఈ మాట
డైరెక్టర్ వేణు బాగున్నాడు
ముందరి తప్పులు దిద్దుకుంటూ
రెండు దశాబ్దాల కలలో లీనం అవుతూ

యాక్టర్ పవన్ బాగున్నాడు
కొన్నేళ్లుగా కలలు కంటున్న వారికి
దగ్గరగా ఉన్నాడు అది స్వార్థం కాదు
ఆ క్రమంలో నిజాయితీగా వాటిని నిజం చేయాలన్న
సంకల్పంలో ఉన్నాడు.. అదే ధర్మం
ఈ మాటే చెప్పాడు ఏది స్వార్థం ఏది ధర్మం అన్నది
ఇంకా ఇంకొన్ని…
నచ్చేయి .. పవన్ లోనూ – పవన్ అభిమానులలోనూ
ఈ సారి అభిమానులు
ఓటముల నుంచి
ఓటముల వరకూ ఉన్నారు
కాదు ఉంటారు
కన్నీళ్లు వద్దనేంత వరకూ
కన్నీళ్లు తుడిచేంత వరకూ
ఎవరో ఒకరు బాధిత పక్షం ఉంటారు
కాదు ఉన్నారు
అన్నయ్యా ! ఎవరు ఏం మాట్లాడినా
మీరు చెప్పండి మేం చేస్తాం
అన్న అభిమానులు నాతో ఉంటారు
కాదు ఉన్నారు
ఔన్సార్ ! కోర్టులు కొన్నింటిని పరిష్కరిస్తాయి
రెప్పల మాటు స్వప్నాలను సైతం సంస్కరిస్తాయి
కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది
కలల్నీ నిజాల్నీ అన్నింటినీ తన వాకిట యుద్ధం చేయిస్తుంది

కొందరు తమ జీవితాన
నేను ఓడిపోయాను అన్న ప్రతిసారి
సమూహంలో గొంతు నడిపించే దారి
పవన్ నుంచి పవన్ వరకూ ఓ ఉత్సాహ వీచిక
ఈ సారి అందరూ నిర్ణయించే లేదా నిర్వచించే
గెలుపు ఉందో లేదో కానీ
ఓయూ దారుల్లో గెలుపు ఉంది అని నిర్థారించాను
మెట్రో దారుల్లో గెలుపు ఉంది అని నిర్థారించాను
పవన్ సర్ తీసుకున్న శ్రద్ధకు నిరూపణ ఈ సినిమా అని
నిర్థారించాను…
వాదన విన్న ప్రతిసారీ నేను గెలిచాను
ప్రతి వాదన విన్న ప్రతిసారీ ఆగిపోయాను
కదలిక ఈ కళ్లది కదలిక ఈ వేళ్లది

మనసు ఆజ్ఞ ఒకటి ఆడబిడ్డల పై ఉంది
వారు గెలిస్తే చాలు కాదు న్యాయం గెలిస్తే చాలు
ఎన్నిసార్లు అరిచానో సత్యమేవ జయతే అని
బాగా కష్టం అనిపించిన చోటు రాణించడమే గెలుపు
వీధి గుమ్మం దగ్గర రాసుకున్న నినాదాలే గెలుపు
అవి పాటింపు గెలుపు.. పవన్ కొన్నేళ్లుగా గెలుపునకు
దూరం అని విన్నాను.. నవ్వేను.. కానీ ఈ సారి
ఆయన గెలవాలి అన్నది నా ప్రార్థన గెలిచేను నేను
నాతో పాటూ ఆయన కూడా.. మరో సారి కోర్టూ
నంద గోపాల్ అను లాయరు సత్యదేవ్ అను లాయరు..
నాతో పాటూ .. ఆ ముగ్గురు ఆడ బిడ్డలూ …
ఈ గెలుపుని ఈ వేగంలో వాటాను అందుకుంటూ
నందాజీ! మీరు కూర్చోండి అని అంటున్నారు

ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఓవర్
గెలిచిన న్యాయం ధర్మ సంబంధం
ధర్మం గెలిచాక ఆనందం ..
సత్యం నిలిచాక ఆనందం
ఆనందించాలి నేను ఆనందించాలి మీరు..

– రత్నకిశోర్ శంభుమహంతి

(Visited 65 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *