లాభాల్లో దూసుకుపోతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌


ఉక్కునగరం :ఉత్పత్తి లాభాల్లో దూసుకుపోతున్న విశాఖ ఉక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ శ్రీ జె. అయోధ్య రామ్ అన్నారు. గురువారం ఉక్కునగరం లోని సిఐటియు కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె. అయోధ్య రామ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు స్థాయిలో ఒక్క మార్చి నెలలో 3267 కోట్ల అమ్మకాలు జరిపి 300 కోట్లు లాభాలు ఆర్జించిందని ఆయన అన్నారు. గత నాలుగు నెలల్లో సుమారు 800 కోట్లు లాభాలు, గత యేడాది కాలంలో సుమారు రూ. 1240 కోట్లు ఉత్పత్తి లాభం అర్జించినట్లు ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టర్నోవర్‌ 13శాతం, ఉత్పత్తి కూడా మరో 5 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు ఉన్నప్పటికీ ఒకటి మాత్రమే పని చేసిందని ఆయన అన్నారు. ఉత్పత్తిలో ఐరన్‌ ఓర్‌ కొనుగోలు వల్ల మరో రూ. 6 వేల భారం పడిందని దీనితో పాటు ప్లాంట్‌ విస్తరణ కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల రూపంలో మరో రూ. 1500 కోట్లు ష్లాంట్‌ చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి వీటన్నింటినీ అధిగమించి ఉక్కు కార్మికులు స్టీల్‌ప్లాంట్‌కు లాభాలు తెచ్చిపెడుతుంటే (పైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

గడిచిన 20 ఏళ్లలో కేంద్రం ఒక్క రూపాయి కూడా స్టీల్‌ష్లాంట్‌కు పెట్టుబడి రూపంలో ఇవ్వలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ తిరిగి కేంద్రానికి డివిడెంట్ల రూపంలో, ఉద్యోగుల ఇన్‌కంట్యాక్స్‌ రూపంలో చెల్లించారని గుర్తు చేశారు. సొంత గనులు కేటాయిస్తే సంవత్సరంలో రూ. 2,500 కోట్ల లాభాలు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పోరాట కమిటి చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ దేశానికే తలమానికంగా విశాఖ స్టీల్‌ను కార్మికులు తీర్చిదిద్దారని తెలిపారు. నాణ్యతలో నెంబర్‌ వన్‌గా ఉన్న కర్మాగారాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు అమలు కాకాపోయినా,. తెలుగు రాష్ట్రాల మీద కుట్రతో ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం పూనుకుందన్నారు. రాబోయే కాలంలో రిజర్వేషన్లు అమలు కావాలన్నా వాటని కాపడుకోవాలన్నా స్టీల్‌ప్లాంట్‌ వంటి స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నారు.
పోరాట కమిటి కొ కన్వినర్‌ కె.ఎస్‌ఎన్‌ రావు మాట్లాడుతూ కరోనా వల్ల తీవ్రఇబ్బందులు ఎదురైనప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ లాభాల బాటలో పయనించిందని అన్నారు. ఉక్కు రక్షణ కోసం రాబోయే రోజుల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి చేయబోయే కార్యక్రమాలను విజయవంతం చేసి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో వైటి. దాస్‌, జె. సింహాచలం,గంధం వెంకటరావు, సంపూర్ణం, జి. బోసుబాబు, బొడ్డు పైడిరాజు, వై. మస్తానప్ప, దాలినాయుడు, దొమ్మేటి అప్పారావు, సీహెచ్‌. సన్యాసిరావు, వరసాల శ్రీనివాస్‌,డి. సురేశ్‌ బాబు, రసూల్‌ బేగ్‌, నెల్లి అప్పలరాజు, వి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

(Visited 184 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *