అందమైన సుందరనగరంగా విశాఖ‌

వీజేఎఫ్ ఆధ్వర్యంలో మేయర్‌, డిప్యూటీ మేయర్ల‌కు స‌త్కారం


విశాఖపట్లం : విశాఖను అందమైన సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషిచేయనున్నట్లు
జీవీఎంసీ మేయ‌ర్‌ గోలగాని హరి వెంకట కుమారి తెలిపారు. వైజాగ్‌ జర్షలిస్టుల ఫోరమ్‌ కార్యవర్గం సోమవారం డాబాగార్జెన్స్‌ వి.జె.ఎఫ్‌. ప్రెస్‌క్లబ్‌లో మేయర్‌ గోలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌
జయ్యాని శ్రీధర్‌లను ఘనంగా సత్కరించారు. ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ఈ
కార్యక్రమంలో మేయర్‌ హరి వెంకట కుమారి మాట్లాడుతూ విశాఖ అన్నిరంగాల్లో అభివృద్ది చేసేందుకు
తగిన ప్రణాళికలు రూపకల్పన చేసి అందుకు తగ్గట్టుగా పనులు చేపడమతామన్నారు. నగర ప్రజలకు మెరుగైనమౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తామ‌న్నారు. అందరి సహకారంతో విశాఖను అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, నగర ప్రజలు ఇలా అందరిని సమన్వయం చేనుకుంటూ ముందుకు సాగుతామన్నారు. ప్రజా నమన్యల పరిష్కారనికే అత్యంత ప్రాధాన్యతనివ్వటం జరుగుతుందన్నారు.

డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ 2012 నుంచి 2021 వరకు అధికారుల పాలన సాగిందన్నారు. ఇకమీదట ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌. జగన్మోహనరెడ్డి, పార్టీ అగ్రనేత వి. విజయసాయిరెడ్డి, యితర ముఖ్యనేతల ఆదేశాలమేరకు నగరాన్ని అభివ్యద్దిపధంలో కొనసాగిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నగరావ్యద్దికి తగిన సహకారం అందించాలని కోరారు. మేయర్‌, డిప్యూటీ మేయర్లు, కార్టారేటర్లు అంతా కలిసి ప్రజలకు మెరురైన పాలన అందిస్తామన్నారు. వి.జె.ఎఫ్‌ అధ్యక్ష కార్భదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌. దుర్గారావులు మాట్లాడుతూ నూతనంగాకైన మేయర్‌, డిప్యూటీ మేయర్లు ప్రజలకు మెరురైన పాలన అందించాలని కోరారు. ప్రజా సంక్షేమకార్యక్రమాల అమలులో మీడియా పాత్ర ప్రసంశనీయమన్నారు. వైజాగ్‌ జర్షలిస్టుల ఫోరమ్‌ సాంప్రదాయంప్రకారం మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో సభ్యులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వరు వివరించారు. వి.జె.ఎఫ్‌. ఉపాధ్యక్షులు ఆర్‌. నాగరాజు పట్నాయ‌క్ స్వ‌గ‌తం ప‌లికిన ఈ కార్యక్రమంలో జాయింటు సెక్రటరీ దాడి రవికుమార్‌, ఎపి. పవర్‌ డిప్లమా ఇంజనీర్స్అ ధ్యక్షులు మహేశ్వరరెడ్డి, ప్రజా పిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిథి బి.3. రామేశ్వరి, వి.జె.ఎఫ్‌. ఉపాధ్యక్షులు టి. నానాజీ, కార్యవర్గసభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎం.ఎస్‌.ఆర్‌. ప్రనాద్‌, దొండా గిరిబాబు, సనపల మాధవరావు, వరలక్ష్మి, శేఖరమంత్రి, గయాజ్‌ తదితరులు పాల్గోన్నారు. మేయరు దంపతులను, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ను పలువురు ఘనంగా సత్కరించారు.

(Visited 170 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *