ప్లీజ్ అమ్మ‌…ఓ సిప్ 

త‌ల్లికి వోడ్కా తాగ‌మ‌ని బ‌తిమ‌లాడుతున్న వ‌ర్మ‌

దివాళీ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్ చేసిన ఆర్జీవి

రాంగోపాల్‌వ‌ర్మ‌..ఏది చేసినా ప్ర‌త్యేక‌త ఉండాల‌నుకుంటాడు. వివాదాలు లేక‌పోతే బోరింగ్ అంటాడు.
తాను అనుకున్నదే తీస్తాడు..చెప్పాలనుకున్న సూటిగా చెబుతాడు..ఎవరికీ భయపడడు.. మీడియాతో ఆడుకుంటాడు..జనాన్ని కవ్విస్తాడు….నిత్యం స్పైసీ కోరుకుంటాడు…అనునిత్యం వార్తల్లో ఉంటాడు. వల్గారిటీని లవ్‌ చేస్తాడు..రోమాన్స్‌ను సిగ్గుపడేలా చేస్తాడు. కాంట్రవర్సీ లేనిదే కాఫీ కూడా తాగడు. నాటి శివ నుంచి నేటి ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్‌ వరకూ.. ఇక అతని పేరు చెప్పాల్సిన పనిలేదు. అతని యాటిడ్యూడ్‌ వివరించాల్సిన అవసరమూ లేదు.. డైరెక్టర్‌గా ఆ డైరెక్టర్‌ గురించి.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రామ్‌గోపాల్ వ‌ర్మ దీపావ‌ళి సంద‌ర్భంగా మ‌రో సారి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. నేను దివాళి యొక్క బోరింగ్ సందర్భాన్ని మసాలా చేయడానికి వోడ్కా సిప్ కలిగి ఉండాలని నా తల్లి మరియు సోదరిని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నాను..అంటూ ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్ చేశాడు. త‌ల్లికి వోడ్కా తాగ‌మ‌ని రిక్వ‌స్ట్ చేస్తుండ‌గా…రాము సోద‌రి న‌వ్వుతూ దిగిన ఫొటో షేర్ చేశాడు. దీంతో కొంద‌రు ఇదేంటి త‌ల్లినే తాగ‌మంటున్నాడ‌ని విమ‌ర్శిస్తుండ‌గా..కొంద‌రు దీనిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రికొంద‌రు వ‌ర్మ ఏం చేసినా ధైర్యంగానే చేస్తాడ‌ని..ఇది పూర్తిగా ఆయ‌న కుటుంబ వ్య‌వ‌హార‌మ‌ని చెబుతున్నారు.

(Visited 9 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *