చ‌ర్య‌లు తీసుకుంటున్నాం

కోవిడ్ రోగులూ ఆందోళ‌న వ‌ద్దు
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి


విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్ర వైద్యశాల లోని కోవిడ్ చికిత్స విభాగంలో ఆక్సిజన్ అందక ఇద్ద‌రు కరోనా రోగులు మృతి చెందారు.  దీనిపై జిల్లా అధికార యంత్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌త్యామ్న‌యా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ విష‌యంపై డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి స్పందించారు. కోవిడ్ ఆసుపత్రి లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామ‌ని చెప్పారు. జిల్లా కలెక్టర్, డీసీ హెచ్ ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడాడాన‌ని, ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చిన‌ట్టు వారు చెప్పార‌న్నారు. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని దృష్టికి సమస్యను తీసుకువెళ్లాన‌న్నారు. ఇప్ప‌టికే 15 మందిని వేరొక ఆసుపత్రి కి తరలించామ‌న్నారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదని స్ప‌ష్టం చేశారు. తిరుమల ఆస్పత్రికి ఈ రోగులను తక్షణమే తరలిస్తున్నామ‌న్నారు. పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే విశాఖ కు తరలించమని ఆళ్ల నాని ఆదేశించార‌ని ఆమేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్య ను కూడా పరిష్కరిస్తామ‌న్నారు. విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామ‌ని పుష్ప శ్రీ వాణి చెప్పారు.

(Visited 117 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *