వెయ్యి తప్పులతో వెబ్ ల్యాండ్ తూతూ మంత్రంగా రీ సర్వే అరకొర గా రికార్డుల స్వచ్చీకరణ – రైతుల అగచాట్లు

అనకాపల్లి  :

 

 

భూమి రికార్డులు చాలా వరకు అస్త వ్యస్తంగా ఉండటంతో భూముల రీ సర్వే కార్యక్రమం కుంటి నడక నడుస్తొంది.వెబ్ ల్యాండ్ లో వివరాలు రైతుల వద్ద నున్న పట్టాలతో సరి పోలని చోట్ల సర్వే కూడా తప్పుల తడకలు గానే తయారవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెవెన్యూ శాఖ భూమి రికార్డులను సక్రమంగా నిర్వహించ నందున రైతులు తీవ్ర కష్టనష్టాలకు గురవుతున్న విషయం తెలిసిందే. 2012వ సంవత్సరం నుండి భూ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు పలు మార్లు రికార్డులను సరి చెయ్య వలసిందిగా మార్గదర్శకాలు ఇస్తునే ఉన్నారు. అయితే రికార్డుల ఫ్యూరిఫికేషన్ విషయంలో ఈ శాఖ రైతులను అప్రమత్తం చెయ్య నందున ఈ కార్యక్రమం లో చెప్పుకోదగ్గ ప్రగతి కనబడలేదు. చేతిలో డబ్బులు పడందే ఏ పనికి పూనుకోని గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు రికార్డుల ప్యూరిఫికేషన్ ను బేఖాతరు చేసారు.

భూముల రీ సర్వే కార్యక్రమం విజయవంతం కావాలంటే రికార్డుల దిద్దుబాటు అవసరం అని భావించిన సిసిఎల్ఎ అధికారులు తరచూ ప్యూరిఫికేషన్ పై దృష్టి సారించాలని ఆదేశిస్తూ వచ్చారు. పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ 90‌ శాతం రికార్డుల దిద్దుబాటు లక్ష్యం నెరవేరలేదు. రైతులు ఎవరైనా రికార్డు లలో తప్పులను సవరించమన్నా,మార్పులు, చేర్పులు చెయ్యించు కోవాలని ప్రయత్నిస్తే వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు సాగిస్తున్నారు. విఆర్ఒ, రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల అవినీతి రాష్ట్ర ప్రభుత్వం కు చెడ్డపేరు తెచ్చిపెడుతొంది.

అధికారులు అధికార పార్టీ నాయకుల భూ సంబంధిత పనులు, వారికి కావలసిన రీతిలో చేస్తూ మరొ పక్క భూ దందాలకు,అక్రమాలకు సహకరిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని విస్సన్నపేట,మురపాక,లగిశెట్టిపాలెం,మాకవరం,మాకవరపాలెం, వేటజంగాలపాలెం,మారేడుపూడి భూ దందాలే ఇందుకు నిదర్శనం. అక్రమాలు వెలుగులోకి వచ్చిన రెవెన్యూ అధికారులు కనీసం స్పందించడం లేదు. కొంత కాలం క్రిందట విశాఖలో భూముల కుంభకోణం వెలుగులోకి వస్తే అప్పటి జాయింట్ కలెక్టర్, కలెక్టర్ చర్యలకు ప్రయత్నించే వారు. కొత్త జిల్లాలు ఆవిర్భావం తరువాత వచ్చిన ఐఎఎస్ అధికారులు కుంభ కోణాలను, అక్రమాలను,వెబ్ ల్యాండ్, రికార్డుల లోటుపాట్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘాలు ద్వజ మెత్తుతున్నాయి.స్పందన కార్యక్రమం కాస్తా మెరుగ్గా ఉన్నప్పటికీ ఆశించిన ప్రగతి కనిపించడం లేదు.

రికార్డులు సరిదిద్దడం పూర్తి కానందున రీ సర్వే వలన మేలు కనిపించకుండా పోతుంది. భూ విస్తీర్ణాలలో హెచ్చు తగ్గులు,అక్రమాలు దిద్దుబాట్లకు నోచుకోవడం లేదు. యదాస్దితికి సర్వే ను పరిమితం చేస్తున్నారు. ఆర్డీఒలు,జెసి లు క్షేత్ర స్థాయికి వెళ్లి సర్వేను పర్యవేక్షించడం లేదు. రికార్డులను స్వచ్చీకరించకుండా భూ కమతాల వాస్తవ విస్తీర్ణం రికార్డు లను చూపుతున్న విస్తీర్ణం ఒకేలా సరి చెయ్యడానికి సర్వే శాఖకు అవకాశం ఉన్న ఈ పని మాత్ర జరగడం లేదు. ఇందువలనే రీ సర్వే మొక్కుబడి తతంగంగా ముగుస్తొంది.అన్ని చక్కబెట్టాలంటే ఒక్కో గ్రామంలో రీ సర్వే కు కనీసం ఆరు నెలలయినా పడుతుందని కొందరు సర్వే అధికారులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రెవెన్యూ ఉన్నతాధికారులు మూకుమ్మడిగా ఒక్క గ్రామంలో సర్వే అయిన క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే రైతులకు మంచి జరుగుతుంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు రైతులకు ఎస్ఎప్ఐ కాఫీలు‌ ఇవ్వడం లేదు. రికార్డు తమ వద్ద లేదని‌ సమాధానం ఇస్తున్నారు.

కబ్జాకు గురౌతున్న వాగులు,గెడ్డలు

అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో సర్వే‌ నెంబరు 57 లో ఏడుగురికి వాగు పోరంబోకు భూమిని అతుకుబడి పట్టాగా వెబ్ ల్యాండ్ లో నమోదు చేసారు. వాగు భూములను ఎసైన్డ్ మెంటు చెసెందుకు వీలు కాదు. దీంతో రెవెన్యూ అధికారులు కొండ పోరంబోకు గా మార్చి అతుకు బడి పట్టాగా చూపిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో గతంలో ఇక్కడ తహసీల్దారు గా పనిచేసిన భాస్కర్ రెడ్డి వెబ్ ల్యాండ్ లో రిఓక్ చేసారు. ఇదే భూమి మరల వెబ్ ల్యాండ్ లో‌ కొండ పోరంబోకు గా దర్షనమిస్తోందని ఒక క్వారీ యజమాని‌ ఈ భూమిని సొంతం చేసుకున్నాడని తాము‌ పిర్యాదు చేసినా అధికారులు కనీసం విచారణ కూడా జరపలేదని మార్టూరు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యజమాని క్రషర్ మెటీరియల్ ని డంపింగ్ యార్డ్ గా వినియోగిస్తున్నాడని స్దానికులు చెప్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా రికార్డులు సరి చెయ్యకపోతే భూముల‌ రీ సర్వే ఒక‌ తతంగం గా మిగిలిపోతుంది.

(Visited 3,107 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.