తుమ్మ‌పాల సుగ‌ర్ ఫ్యాక్ట‌రీపై విషం క‌క్క‌‌తున్న‌దెవ‌రు?


అంప‌శ‌య్య‌పై ఫ్యాక్ట‌రీకి కార‌ణ‌మెవ‌రు?
క‌ష్టాన్నే న‌మ్ముకున్న క‌ర్ష‌కుల క‌న్నీళ్ల‌కు ఎవ‌రిది బాధ్య‌త‌?
అధికారుల మ‌హా నిర్ల‌క్ష్య‌మే ఫ్యాక్ట‌రీకి శాప‌మా?
తీపి పంచే ఫ్యాక్ట‌రీ వెనుక జ‌రుగుతున్న‌దేమిటి?
వినియోగానికి పనికి రాని 3,500 బ‌స్తాల చక్కరకు ఎవ‌రు స‌మాధాన చెబుతారు?
అమ్మ‌కానికి అనుమ‌తులు వ‌చ్చినా స్పందించ‌ని యాజ‌మాన్యం

అన‌కాప‌ల్లి : మ‌ర‌ణం కోనం అంపశయ్యపై ఎదురుచూన్తున్న భీముని కథ‌లా ఉంది అనకాపల్లి వి.వి రమణ
(తుమ్మపాల) నహకార చక్కెర కర్మాగారం పరిస్థితి. ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన ఈ కర్మాగారాన్ని ఇప్పుడు చూస్తే కడుపు తరుక్కుపోతుందని రైతులు, కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీకి ఆది నుంచి యాజమాన్యమే పెద్ద మైనన్‌గా చెప్పవచ్చు. ఎందుకు క్రషింగ్‌ నిర్వహిస్తారో ? ఎందుకు పంచదార ఉత్పత్తి చేస్తారో..? ఉత్పత్తి చేసిన పంచదారను అమ్మకుండా పాడై పోయిన వరకూ ఎందుకు ఉంచుతారో ? ఎవరికీ అర్ధం తుగ్లక్‌ పాలన తీరుగా యాజమాన్యం వైఖరి ఉందనే విమర్శలు వినిపిన్తున్నాయి.


ఉత్పత్తి అయిన పంచదార ఇప్పుడు నుమారు 3,500 బస్తాలు వరకూ చక్కెర పాడై పోయిందని కార్మికులు చెబుతున్నారు. అమ్మడానికి పనికి రాని విధంగా ఉన్న ఈ చక్కెర పరిన్ధితికి కారకులు ఎవరు 2018-19లో 15,700 టన్నువ‌రకు క్రషింగ్‌ నిర్వహించి నుమారు 7 వేల బస్తాల చక్కెర ఉత్పత్తి చేసారు. రికవరీ శాతం తక్కువ కావడం వలన నాణ్యత లోపించిన చక్కెర అధిక శాతం ఉంది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదని అందరికీ తెలును. కానీ క్రషింగ్ జ‌రిగి ఇంతకాలమైనా ఈ చక్కెర గోడౌన్‌లలో మూలుగుతుంది. ఇందులో నగం చక్కెర అంటే 3,500 బస్తాలు, వ‌రకూ పూర్తిగా పాడైంది. ఇది వినియోగానికి పనికి వన్తుందో రాదో తెల్సుకోవడానికి లాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించారు. ఈ చక్కెర వినియోగానికి పనికి రాదని ల్యాబ్‌ రిపోర్టు వచ్చినట్లు నమాచారం. మిగిలిన చక్కెర పాడ‌వ‌కుండా ఉండేందుకు అమ్మకానికి అనుమతులు మంజూరు చేయాలంటూ డైరెక్టర్‌ ఆఫ్ సుగర్స్‌కు పంపడం,అక్కడ నుండి గ్రీన్‌ నిగ్నల్‌ రావడం జరిగింది. అనుమతులు వచ్చి రెండు నెలలు కావన్తున్నా యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అమ్మకానికి అనుమతులు రాలేదంటూ బాధపడుతూ ఉన్న యాజమాన్యం
ఇప్పుడు ఎందుకు అమ్మడం లేదు ? క్రషింగ్‌ నీజన్‌లో పని చేసిన లేబర్‌కు ఇంత వరకూ చెల్లింపులు జరగలేదు. కార్మికుల‌కు వేతనాలు లేవు. చక్కెర అమ్మితే ఎంతో కొంత సొమ్ములు అందుతాయి. కొన్ని నమన్యలు తీరుతాయి. అలాగే వదిలేస్తే పూర్తిగా పాడైపోయి ఎందుకూ కొరగాకుండా పోతుంది.

గతంలో ఫ్యాక్టరీ ఎమ్‌.డి చక్కెర అమ్మడానికి ప్ర‌య‌త్నాలు చేయగా రైతులు అడ్డుకున్నారు. మా చెల్లింపులు జరపకుండా చక్కెర అమ్మడానికి వీలు లేదంటూ ప‌ట్టు బట్టడంతో అప్పుడు నిలిచిపోయింది. తర్వాత ఎవరూ దీనిపై దృష్టి సారించలేదు. రైతులకు పూర్తిగా చెల్లింపులు జ‌రిపాకే చక్కెర అమ్ముదామనుకుంటే అప్పటికి చక్కెర పూర్తిగా పాడై పోయింది. కార్మికులతో నమావేశం ఏర్పాటు చేసి వారిని ఒప్పించి చక్కెర అమ్మకాలకు రంగం సిద్ధం చేయవచ్చు. కానీ ఆ దిశగా యాజమాన్యం కదలడం లేదు. అస‌లు నమన్యను పరిష్క‌రించాలనే చిత్త శుద్ధి యాజమాన్యంలో ఏ కోశానా కనిపించడం లేదు. యాజమాన్యం దీనిపై దృష్టి సారించడం లేదు. కనీనం ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌‌ అయినా దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుకుంటున్నారు.

(Visited 362 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *