లాభాల్లో స్టీల్ ప్లాంట్‌పై ఎందుకీ క‌క్ష‌

అన‌కాప‌ల్లి :విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 18 వేల కోట్ల టర్నోవర్ నమోదైందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ మీడియా కో ఆర్డనేటర్ కొణతాల వెంకట్రావు అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 19 శాతం వృద్ధిని సాధించి గత నాలుగు నెలల్లో సుమారు 740 కోట్లు నికర లాభాలను ఆడించిన స్టీల్ ప్లాంటును ఏ విధంగా ప్రైవేటీకరణ దిశగా తీసుకు వెల్తారని ఆయన ప్రశ్నించారు.

ఇది ప్రైవేటీ పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసి కార్మికుల పొట్టను కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల స్టీల్ ప్లాంట్ కు లాభాలు తెచ్చి పెడుతుంటే ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యని వెంకటరావు తెలిపారు. సొంత గనులు కేటాయిస్తే ఈ సంవత్సరం కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా స్టీల్ ప్లాంట్ కు పెట్టుబడి రూపంలో ఇవ్వలేదని వెంకటరావు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ తిరిగి కేంద్రానికి డివిడెండ్ రూపంలో ఉద్యోగులు ఇన్కమ్ టాక్స్ రూపములో వేల కోట్ల రూపాయలు చెల్లించారని వెంకటరావు అన్నారు. రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని బ్రిటిష్ వారితో పాటు పోర్చుగీస్ డచ్ వారు దేశ సంపదను కొల్లగొట్టారని సంపన్నమైన భారతదేశాన్ని పేద దేశాల గా మలిచితే బ్రిటిష్ కాలం నుంచి ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న రకరకాల కార్మిక చట్టాలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మిక హక్కులను కాలరాస్తూ ఉందని కేవలం కుంటిసాకులతో లాభాల బాటలో ఉన్న పరిశ్రమలను గుజరాత్ బడా పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా అమ్మేయాలని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అధికారం ఉందని అన్యాయంగా దుర్మార్గంగా ఒంటెత్తు పోకడలతో గుజరాత్ పారిశ్రామికవేత్తలకు ఇప్పటికే గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు అదాని గ్రూపులకు కట్టబెట్టిందని ప్రక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ ని కూడా అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని బీజేపీకి గోరి కట్టే సమయం ఆసన్నమైందని వెంకటరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యపరిచి విద్యార్థి యువజన సంఘాలు అసంఘటిత కార్మికులు ప్రజా సంఘాలు అందరినీ సమన్వయం చేసుకొని పోరాట దిశగా అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం తీవ్రతరం చేయాలని వెంకటరావు కోరారు.
బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడానికే ప్రైవేటీకరణ -కొణతాల వెంకటరావు

(Visited 79 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *