వీ డ్రీమ్స్ కలెక్టరేట్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన లను చేపట్టాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం అనకాపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న అర్జీల పై ఆమె అధికారులతో సమీక్షించారు.
వివిధ శాఖల అధికారులు తాసిల్దార్లు తమ లాగిన్ లో ఉన్న ప్రజా ఫిర్యాదులపై అర్జీ దారులతో నేరుగా మాట్లాడి
క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అర్జీ లపై కార్యాలయ ఉద్యోగులతో అధికారులు ప్రతిరోజు సమీక్ష నిర్వహించి ఆ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవాలని ఆదేశించారు. పరిష్కారం కానీ లేదా పరిష్కారంలో ఎదుర ఉతున్న సమస్యలపై ఉన్నతాధికారులతో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలన్నారు. పరిష్కార కాకపోతే ఆ విషయాన్ని అర్జీదారులకు తెలపాలన్నారు. ఇలా చేయడం వల్ల అర్జీ దార్లు పదేపదే కార్యాలయాల చూట్టూ తిరగవలసిన అవసరము ఉండదు అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జాహ్నవి డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు
