వీ డ్రీమ్స్ అనకాపల్లి
అర్జీల ను ఆన్ లైన్ లొ కూడ నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించామని
జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను (పి జి ఆర్ ఎస్ ) నేడు జులై 28 సోమవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించను న్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్ తో పాటు అన్ని మండల, మునిసిపల్, డివిజనల్ కార్యాలయాల్లోనూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్ ) కు అనివార్య కారణాలు వలన రాలేనివారు తమ అర్జీలను ఆన్ లైన్ ద్వారా meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల సమాచారం కోసం 1100 ( ఒకటి ఒకటి సున్నా సున్నా )కు కాల్ చేసి తమ అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు. కావున అర్జీదారులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు
