వీ డ్రీమ్స్ అనకాపల్లి
రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ప్రతి ఇంటికి బిగిస్తుంది. ఎన్నికల ముందర తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ చెప్పిన మాటలు కట్టుబడి ఉండాలని అనకాపల్లి సిపిఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు పొలమురి శెట్టి వారి వీధి, గంగిరాంశెట్టి వీది, శతకం పట్టు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, సీనియర్ నాయకులు కాళ్ళ తేలయ్యబాబు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వలన విద్యుత్ బిల్లులు పెరగవని, ఎటువంటి ఇబ్బంది ఉండదని, విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ప్రభుత్వం ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది వాస్తవం కాదని, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దాయడం సరైయింది కాదన్నారు.
గత వైయస్ఆర్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే బిల్లులు ఎక్కువ వస్తున్నాయని బాదుడే బాదుడు అని వాటిని పగలగొట్టండి అని యువగళం లో నారా లోకేష్ బాబు ప్రకటించారని గుర్తు చేశారు.. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు తొలగిస్తామని, విద్యుత్ బిల్లులు పెరగవని రూపాయికే విద్యుత్తు ఇవ్వవచ్చని డాంబికాలు పలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ ని బిగింస్తోందని, స్మార్ట్ మీటర్ వలన ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగినట్టు రుజువైందన్నారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ కూడా స్పందించి బిల్లులు పెరిగిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారన్నారు. స్మార్ట్ మీటరు ప్రీపెయిడ్ మీటర్ ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, స్మార్ట్ మీటర్ నిర్వహణ అదానీ కంపెనీ చూసుకుంటుందని, స్మార్ట్ మీటర్ పగలు ఒకరేటు, రాత్రి ఒక రేటు వసూలు చేయాలని చెబుతున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు కొనుగోలుకి 25 వేల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ అదానీకి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి ఇచ్చిందని, ఈ భారం ప్రజలపై నే వేస్తున్నారన్నారు. బాగా పనిచేస్తున్న మీటర్లు ఎందుకు తొలగించాల్సి వస్తుందో చెప్పడం లేదని. తెలుగుదేశం ప్రభుత్వం పారదర్శకత ఉంటుందనే పేరుతో ప్రజలన్నీ నమ్మించి స్మార్ట్ మీటర్ల్ని బిగిస్తున్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించాలనిసిపిఎం పార్టీ ప్రజలకు పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో పెంటకోట శ్రీనివాసరావు, దాడి సంపత్ కుమార్, బీశేట్టి సుబ్బారావు, బుగిడి నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు
