ముడుపుల మేళా గా మారుతున్న రీ సర్వే

(వీ డ్రీమ్స్ అనకాపల్లి)

అనకాపల్లి మండలం కొండుపాలెం రీ సర్వే యావత్ అక్రమాల చిట్టా గా, తప్పుల తడక గా తయారయింది.కొన్ని అంశాల లో రీసర్వే నిబంధనావళిపాటించకుండా సర్వే నిర్వహించారు.తప్పులతో ఉన్న అడంగల్ ను అనుసరించడం వల్ల రైతుల పేర్లు సైతం తప్పులు దొర్లాయి. 9(2) నోటీస్ ల లో సరిగా ఉన్నా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో తప్పలు కో కొల్లలు గా ఉన్నాయి.సిబ్బంది
నిర్లక్ష్యం ఒక్క కొండుపాలెం మాత్రమే కాక మిగతా రీ సర్వే గ్రామాల్లో కూడా కనిపిస్తోంది .
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీ సర్వే నిర్వహణకు చక్కని ప్రణాళిక రూపొందించారు. అయితే కొండుపాలెం లాంటి చోట్ల కొంతమంది అవినీతి పరులు కారణంగా సర్వే చాలవరకు అక్రమాల సర్వే గా మారిపోతోంది.డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా సర్వే ను మార్చివేశారు.ముడుపులు ఇచ్చిన వారు చెప్పినట్టే సర్వేయర్లు అక్రమాలకు ఒడిగట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. 9(2) నోటీస్ లు ఇస్తే తప్పుకు దొరుకుతామనుకున్న చోట్ల ఆ నోటీస్ లు ఇవ్వడం ఎగ్గొట్టారు. రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ ఇమ్మని చెప్పినా కొందరికి 9(2) నోటీసులు ఇవ్వలేదు . నోషనల్ ఖాతా ల విషయం లో గత ఏడాది జరిగిన రీ సర్వేలో భూ యజమని లేదా ఆ కుటుంబం ఇంటి పేరు నోషనల్ ఖాతా నెంబర్ ఎదురు గా పేర్కొన్నారు. ఈ సారి పేర్లు రాయ కుండా పట్టాదారు అని మాత్రమే పేర్కొన్నారు.ఇలా గుర్తింపు లేని విధంగా రాయడం సమస్యలకు దారి తీస్తోంది. ఇటీవల గొలగాం సర్వే నెంబర్ 140/1 సర్వేనెంబర్ లో కొంత భాగం గత రి సర్వేలో వివాదం కారణంగా పట్టాదారిగా నమోదు చేసి వదిలేసారు. అయితే ఇటీవల ఈ సర్వే నెంబర్ లో ఉన్న విస్తీర్ణాన్ని ఆక్రమణదారుడు కి రెవెన్యూ అధికారులు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పట్టాదారు పాసుపుస్తకాలు చేసేశారు.

కొండుపాలెం లో
సర్వేయర్లు కొన్ని సర్వే
నెంబర్ ల లో గ్రౌండ్ ట్రూతింగ్, వేలడేషన్ చేయకనే కిట్టింపు జరిపి మొత్తంగా రైతులకు విస్తీర్ణాలు తగ్గించేశారు.
ఒక రైతు సంబంధించిన విస్తీర్ణం, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ,సర్వే నంబర్ తో సహా ఈ సర్వే నంబర్ సంబంధం లేని వేరొక రైతు ఖాతాకు జమ చేశారు. మరొక రైతుకు చెందిన ఎల్పీఎం ను పక్క రైతు ఖాతా లో వేశారు.రైతుల పేర్లు లో గందరగోళం వల్ల ,రైతులు అందజేసిన రికార్డ్ సరిచూడనందున ఈ పోరపాటు చోటుచేసుకుంది. ఇక్కడ కూడా 9(2) నోటీస్ లు ఇవ్వ నందున ఇది సమస్య గా తయారైంది.మ్యాండేటరీ 9(2) నోటీసులు అందరికి ఇచ్చారా లేదా అని తనిఖీ
చేయడం లేదు. గత ఏడాది రీ సర్వే లో
జరిగిన ఈ తనిఖీ ఇప్పుడు జరగడం లేదు. భూ యాజమానుల పేర్లకు బదులు డబ్బులు ఇచ్చిన వారి పేర్లు రికార్డు చేసిన సర్వేయర్ లను అప్పట్లో కలెక్టరేట్ సీనియర్ అధికారి ఒకరు తీవ్రం గా హెచ్చరించి సరిచెయించారు.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాయం

రీ సర్వే పూర్తయిన తర్వాత సర్వే వివరాలు రైతులు తెలుసుకునేందుకు గ్రామ సభ జరిపి డ్రాఫ్ట్ నోటీసును రైతులకు అందు బాటులో ఉంచుతారు. కొండుపాలెం లో ఈ నోటీస్ 3 రోజుల్లోనే మాయమైంది. దాంతో రైతులు తమ వివరాలు తెలుసుకునేందుకు వీలు లేకుండా పోయింది. సర్వే సిబ్బంది తో మీలాఖతై బంజర్లను తమ పేరిట నమోదు చేయించుకున్న వారే
దీన్నీ మాయ చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రభుత్వ భూములను తమ పేరిట మార్పించుకున్నారంటూ కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

రీ సర్వే అక్రమాలపై రీ సర్వే ప్రారంభం మ యనదగ్గరనుంచే విమర్శలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి రీ సర్వే డిప్యూటీ తాసిల్దారు 9(2) నోటీసులు జారీ విషయం లో ఇచ్చిన ఆదేశాలను సర్వే బృందం పాటించలేదు.
చివరకు ఈ విషయం పై pgrs లో వచ్చిన పిర్యాదుల పై రెవెన్యూ ఉన్నతాధికారులనే
తప్పుదోవ పట్టించారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తప్పుల పై అభ్యంతరాలను రైతులు తెలియ చేసి వాటిని సవరించాలని కోరగా సమయం మించిపోయిందని
రెవెన్యూ సిబ్బంది చెప్తోంది.
చేసేదిలేక గ్రామస్తులు PGRS లో కలెక్టర్ కు పిర్యాదు చేశారు.
రీ సర్వేలో ఒక సర్వేయర్ అంతా తానే అయి వసూల్ రాణిగా వ్యవహరించారని కొందరు గ్రామస్తులు ఆరోపించారు.

రీ సర్వే ను గడువును 60 రోజులకు తగ్గించడం, రీ సర్వే పై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సరైన శిక్షణ లేని ,అవగాహన లేని వారిని రీ సర్వే డీటీలు గా నియమించడం, కొన్నిచోట్ల వారిని నామమాత్రంగా ఉంచడం రీ సర్వేను అస్తవ్యస్తం చేస్తోంది. చాలామంది తహశీల్దార్లు సర్వే జరిగే గ్రామాలకి పోవడంలేదు.
ఫైనల్ ఆర్వోఆర్ ప్రకటన తర్వాత తప్పులను సవరించుకొనేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆది
రైతులను ఎన్ని వ్యయ ప్రయాస లకు గురి చేస్తుందో
చెప్పనక్కర లేదు.

తగరంపూడి లో ను
అక్రమాలు

తగరం పూడి లో ఒక సర్వేయర్
నడంపల్లి తిరుపతి రాజు ఎలియాస్ శ్రీనివాసరాజు అనే రైతుకు సర్వే నెంబర్ 146-1 లో 3.96 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఈ రైతుకు చెందిన ఏకండి మడిలో కొంత భాగాన్ని సచివాలయ సర్వేలు రైతు అనుమతి లేకుండా వెనకనున్న రైతుకు రోడ్డు కల్పించేందుకు సిట్టింగ్ చేయడంతో ఈ రైతు రెవెన్యూ అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతు సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. పైపెచ్చు రెవిన్యూ అధికారులు ఆక్రమణదారుడికి అండగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు భూమి లో కొంత బాగాన్ని ఆ రైతుకు చెప్పకుండానే పక్క రైతు పొలానికి తోవ కోసం కేటాయించారు. ఇదేమని అడిగితే అదంతే
అని చెబుతున్నాడని బాధిత
రైతు అనకాపల్లి తాసిల్దార్ కి పిర్యాదు చేశారు.

రీ సర్వే సరిగా జరపకుంటే
దీని కోసం ఖర్చు చేస్తున్న మొత్తం
బూడిద లో పోసిన పన్నీ రవుతుంది. రెవిన్యూ శాఖ కు సర్వేశాఖ కు అటు ప్రభుత్వానికి
చెడ్డపేరు,రైతుకు కష్టాలను కొని తెస్తుంది

రీ సర్వే లో ఎవరిదో అర ఎకరా నా ఖాతాలో పడింది బావ !! అంతా ‘సర్వే’ శరుండి దయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *