వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డీ.ఏ.వి. పాఠశాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. మహాదేవ శాస్త్రి మార్గదర్శకత్వంలో నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మహదేవ్ శాస్త్రి మాట్లాడుతూ ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం కల్పించడం, సానుకూల ఆలోచనలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.
ప్రముఖ మానసిక వైద్యులు డా. ఎస్. కె. కాజా మోయుద్దిన్ ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు. ఆయన మానసిక ఆరోగ్యం వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి, విజయానికి, మరియు సమాజ సౌభ్రాతృత్వానికి ఎంత కీలకమో వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
ఎం. పవర్ – ఆదిత్య బిర్లా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి శ్రీమతి పి. సునీత రాణి (మానసిక శాస్త్రవేత్త) మరియు శ్రీ బి. అనిల్ కుమార్ (మానసిక శాస్త్రవేత్త) లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. వారు విద్యార్థులకు మానసిక సమతుల్యతను కాపాడుకోవడం, ప్రతికూల ఆలోచనలను ఎదుర్కోవడం, మరియు సానుకూల దృక్పథంతో జీవించడం గురించి చక్కగా వివరించారు.
ఈ కార్యక్రమం ఇన్‌చార్జ్ శ్రీమతి ఎం. ఉమా పర్యవేక్షణలో, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వి. ప్రభాకర్ మరియు శ్రీమతి డి.వి. లక్ష్మి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు టి. ధనశ్రీ మరియు డి.ఎన్.వి. స్వాతి తమ అనుభవాలను పంచుకుని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “మనసు బలంగా ఉంటే జీవితం వెలుగులు నిండుతుంది” అనే నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేశారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు మాత్రమే కాకుండా, సమాజానికి కూడా సానుకూల సందేశాన్ని అందించింది. కార్యక్రమం మొత్తం ఎంతో సమాచారపూర్వకంగా, ప్రేరణాత్మకంగా సాగి, “ప్రతీ ఒక్కరి మానసిక ఆరోగ్యం ముఖ్యం” అనే ఆత్మీయ సందేశాన్ని అందరికి చేర్చింది.
