రెవెన్యూ, సర్వే అధికారుల అక్రమాల కారణంగా కొండుపాలెం సర్వే తప్పుల తడక గా తయారైందని గ్రామ సర్పంచ్ వరలక్ష్మి జగన్నాథం ధ్వజమెత్తారు. కొండు పాలెంలో గురువారం జరిగిన సర్వే డి ఎల్ ఆర్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ల్యాండ్ ప్యూరిఫికేషన్ జరగకుండానే రీ సర్వే జరిగిందని అంటున్న కు కొండుపాలెం రైతులు రీ సర్వే లోప రహితంగా ఉండాలని ముఖ్యమంత్రి పదేపదే చెప్తున్న అధికారులు పెడచెవిన పెట్టడం శోచనీయమని అన్నారు. సర్వేనెంబర్ 34/2a,2-7 లో అక్రమాలకు పాల్పడి రెవెన్యూ అధికారులు చట్టానికి తూట్లు పొడిచారని విమర్శించారు . నిబంధనలకు విరుద్ధంగా జారి అయిన పాస్ పుస్తకాలను రద్దు చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు . గతంలో రెవెన్యూ అధికారుల వల్ల తప్పులు జరిగితే తామేం చేస్తామని ప్రస్తుత రెవెన్యూ అధికారులు చెప్పడం తగదని తప్పులు సరిచేసే బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రైతులను దెబ్బతీసిన అధికారులే కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా పనిచేస్తున్నారని విమర్శించారు. రైతుల పి జి ఆర్ ఎస్ దరఖాస్తులను పరిష్కరించకుండానే ముగించి వేస్తున్నారని ధ్వజమెత్తారు జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.
నిజమైన రైతుకు అన్యాయం జరిగితే రికార్డులు ఎందుకు రీ సర్వే ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
వీ డ్రీమ్స్ అనకాపల్లి
114 / 13 లో నివాస ప్రాంతాన్ని వ్యవసాయ భూమిగా తన ఖాతాలో చేర్చడం గ్రామంలో అపోహలకు దారితీసిందని ఎం .నరసింగరావు అనే ప్రజాప్రతినిధి వాపోయారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో విచారణ జరపాలని కోరారు
రిసర్వే సదస్సులు మొక్కుబడిగా తయారవుతున్నాయని విమర్శించారు. లక్ష్మీనరసింగరావు (బాబీ) అనే రైతు తమ భూములను సర్వే చేయలేదని 9(2) నోటీసులు ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. రెవిన్యూ కార్యాలయాల్లో ల్యాండ్ సీలింగ్ రికార్డులు పోయాయని రెవెన్యూ అధికారులే చెప్తున్నారని దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ మాట్లాడుతూ రైతుల ఫిర్యాదులను అర్జీలను తప్పక పరిశీలిస్తామని తప్పులను దోషాలను సవరించి స్వచ్ఛమైన రికార్డును రైతులు అందిస్తామని చెప్పారు ఈ సదస్సులో రైతులు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. ఇచ్చిన అర్జీలు అన్నింటిపై విచారణ జరిపి ఫైనల్ ఆర్ఓఆర్ ను వెలువరిస్తామని రీ సర్వే డీటి హామీ ఇచ్చారు. వీఆర్వో దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

