వీ డ్రీమ్స్ అనకాపల్లి
నక్కపల్లి తాసిల్దార్ గా బి చిన్నకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానున్న నక్కపల్లి మండలం కీలకంగా మారిన నేపద్యంలో ఇక్కడ తాసిల్దార్ పోస్ట్ కు బి చిన్ని కృష్ణుని జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారు. తాసిల్దార్ గా బదిలీ అయి 50 రోజులు నిండకుండానే ఇక్కడ తాసిల్దార్ని బదిలీ చేసి మరి ఈ పోస్టింగ్ను చిన్ని కృష్ణకు కట్టబెట్టారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూసేకరణ తదితర పనులను సమర్థంగా నిర్వహించేందుకు చిన్ని కృష్ణ తగిన వ్యక్తిని జిల్లా కలెక్టర్ భావించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా ప్రతినిధులను నెత్తినెక్కించుకోని, ఒత్తిళ్లకు లొంగని అధికారి అయితేనే ఇక్కడ సమస్యలు తల ఎత్తకుండా ఉంటాయని కలెక్టర్ భావించి పాలన సౌలభ్యం పేరిట ఈ బదిలీ చేపట్టారని చెప్తున్నారు. తిమ్మిని బమ్మిడి గా బమ్మిని తిమ్మిగా మార్చగల గటన ఘటన సమర్ధుడని కృష్ణకు పేరు ఉంది. భూ సేకరణ ,పునరావాసం వంటి అంశాల్లో ప్రజా ఉద్యమాలకు ఆందోళనలకు లొంగితే పనులు త్వరితగతిన పూర్తి కావు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ట కరమైనది. అవసరమైతే
నిబంధనలను పక్కనపెట్టి నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించగల శక్తి ఉన్న వ్యక్తిని తాసిల్దారుగా నియమించడం అవసరమని కలెక్టర్ భావించినట్లు న్నారు.
ఇదిలా ఉండగా
వైసిపి నాయకులకు పెద్దపీట వేసే తాసిల్దార్ లను గుర్తించి ఈ బదిలీల్లో వారిని కీలక స్థానాలో నియమించినట్లు రెవెన్యూలో మరో వర్గం ప్రచారం చేస్తోంది. వైసిపితో మంచి కనెక్షన్ ఉన్న చిన్ని కృష్ణను నక్కపల్లి లో నియమించడానికి ఇది కూడా ఒక కారణం అని భావించేవారు ఉన్నారు. అనకాపల్లి ఎండోమెంట్ వ్యవహారంలో అప్రతిష్ట మూట కట్టుకున్న కలెక్టర్ తనకంటూ నమ్మకస్తులతో ” షీ టీం” ను తయారు చేసుకున్నట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసిపి హయంలో మంత్రి ముత్యాల నాయుడుకు అత్యంత విధేయుడుగా వ్యవహరించిన తాసిల్దార్ను కలెక్టరేట్లో నియమించిన కూటమి నాయకులే తిరిగి ఆ అధికారినిఅనకాపల్లి సమీపంలోని మండల తాసిల్దారుగా నియమించడానికి పావులు కదిపారని తెలియ వచ్చింది . ఆఅధికా రి కలెక్టర్కు కూడా అత్యంత విదే యుడు ఎండోమెంట్ వ్యవహారంలో కలెక్టర్ కు అనుకూలంగా రెవెన్యూ అసోసియేషన్ను పనిచేయించడానికి, బహిరంగ ప్రదర్శనలు చేయడానికి ఈ అధికారి మూల కారణం అన్నది బహిరంగ రహస్యమే.
మొత్తం మీద మొన్నటి బదిలీల్లో ఒకరిద్దరు తప్ప అందరూ కలెక్టర్ కు అత్యంత నమ్మకస్తులు
అని ప్రచారం జరుగుతోంది.
ఒకరిద్దరిని అవినీతి ఆరోపణల కారణంగా కూడా బదిలీ చేసి నట్లు తెలుస్తోంది
