వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి కి సమీపం లోని ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ నిర్వహించిన స్వచత హి సేవ కార్యక్రమం స్వాచ్సోత్సవ్ పలువురి ప్రశంసలు అందుకుంది. పదిహేను రోజులు పాటు జరిగిన ఈ కార్యక్రమం లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు
ఏటీఎస్ ఉద్యోగులు కృషి చేసి
స్వచ్ఛత కార్యక్రమం స్ఫూర్తిని
వ్యాప్తిచేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉన్న ఎటిఎస్ కేంద్రాల్లోనూ, పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమం
నిర్వహించారు. ఆ బాటలోనే కేంద్రప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. పేరుకుపోతున్న చెత్త, ముఖ్యం గా ప్లాస్టిక్ వ్యర్ధాలు
ఓ పెద్ద సమస్య గా తయారైంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లో ప్రభుత్వ యంత్రాంగం కు ప్రజా సహకారం అవసరం.
ప్రధాని మోడీ ఇచ్చిన ఈ సందేశం ను ATS వ్యాప్తి చేయడమే కాక కార్యక్రమం లో చిత్తశుద్ధితో, అంకిత భావంతో మమేకం
కావడం ప్రశంసనీయం



