భోగాపురం క్రెడిట్ ముమ్మాటికీ వైఎస్ జగన్‌దే : బొత్స

వీ డ్రీమ్స్ విజయనగరం

కూటమి పాలనలో రైతుల విలవిల”: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం,

భోగాపురం విమానాశ్రయం జగన్ విజన్, బొత్స

​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కూటమి నేతలకు దేవుడు త్వరలోనే మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షించారు.
​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై కూటమి నేతలు చేస్తున్న ప్రచారాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు.
​వాస్తవం: “భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, నిధులు కేటాయించి, ప్రాజెక్టును పట్టాలెక్కించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే. ఈ క్రెడిట్ మరెవరికీ దక్కదు.”
​ప్రశ్న: “గతంలో జీఎంఆర్ (GMR) సంస్థను అభినందించిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, ఇప్పుడు వారి పేరు ఎందుకు ప్రస్తావించడం లేదు? అభివృద్ధిలో రాజకీయం చేయడం సిగ్గుచేటు.”
​మాస్టర్ ప్లాన్: విశాఖ మాస్టర్ ప్లాన్‌ను ఎందుకు ఫైనల్ చేయడం లేదని, అది పూర్తయితే కనెక్టింగ్ రోడ్లు ఎప్పుడో పూర్తయ్యేవని ఆయన గుర్తు చేశారు.
​రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని బొత్స విమర్శించారు.
రాష్ట్రంలో సామాన్య రైతులకు యూరియా అందడం లేదు, కానీ కూటమి నేతల ఇళ్లలో మాత్రం నిల్వలు ఉంటున్నాయి. వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటూ రైతుల రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు.
“వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చింది. నేడు ఇన్సూరెన్స్ అందక రైతులు రోడ్డున పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బీమా సొమ్ము చెల్లించాలి.” ఉత్తరాంధ్రలో అభద్రత
​ఉత్తరాంధ్ర ఎప్పుడూ ప్రశాంతతకు మారుపేరని, కానీ కూటమి పాలనలో ఇక్కడ పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు.
​ “రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారని గతంలో గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా?” అని నిలదీశారు.
​”పాలన అంటే ప్రచార ఆర్భాటం కాదు, ప్రజల కష్టాలను తీర్చడం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అబద్ధాల ప్రచారాన్ని ఆపి, క్షేత్రస్థాయిలో రైతులను, సామాన్యులను ఆదుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *