వీ డ్రీమ్స్ చోడవరం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో జరిగిన అవకతవకలు అరాచకాలు కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని, పాత పద్ధతులే నడుస్తున్నాయని ఓపక్క విమర్శలు…. దాంతో తాము ఇంకా జగన్ పాలనలోనే ఉన్నామా అని ప్రజలు ఆవేదన చెందుతుంటే …
ఆ మాట నిజమే నన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కూడా కొన్నిప్రభుత్వ కార్యాలయాల్లో, కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా దర్శనం ఇస్తున్నాయి.
ఇందుకు చోడవరం మండలంలోని గజపతినగరం గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలే నిదర్శనం.
జగన్ హయాంలో అరాచకాలకు పాల్పడిన ఉన్నతాధికారులు నేటికీ పాలనలో చక్రం తిప్పుతున్నారు.. ప్రజా వేదిక కూల్చివేతలో అత్యుత్సాహం చూపిన అధికారులును సైతం కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది.
నేను వచ్చేస్తున్నా మళ్ళీ ముఖ్యమంత్రి నేనే
అంటూ జగన్ చేస్తున్న హడావుడిని చూసి ఎందుకైనా మంచిదని జగన్ ఫోటోలను కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా
ఉంచుతున్నారుపాపం అధికారులు కొందరు ఉన్నారంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మరి ఈ ఫోటోపై ఉన్నతాధికారులు కూటమి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

