వీ డ్రీమ్స్ అనకాపల్లి స్థానిక డిఏవి పబ్లిక్ స్కూల్ లో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ హెచ్ ఎం మహాదేవ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులచే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా కృష్ణుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మహాదేవ్ శాస్త్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, పద్ధతులు చిన్ననాటి నుండి పిల్లలు అలవర్చుకోవాలని అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ వంతు పాత్రను పోషించాలన్నారు. మన సంస్కృతిని మరిచిపోకూడదు అనే ఆలోచనతోనే స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అని తెలిపారు ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



