వీ డ్రీమ్స్ అనకాపల్లి
గుట్టుచప్పుడు కాకుండా 40 కోట్ల రూపాయల దేవస్థాన భూమి ని ప్రైవేట్ పరం చేసేందుకు స్కెచ్ గీసింది ఎవరు? నియమ నిబంధనలను కాలరాసి అత్యంత దుర్మార్గంగా ఫైల్ నడిపిందెవరు? ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు ? అనే చర్చ జిల్లాలో ప్రారంభమైంది. పైనుంచి కింద వరకు అత్యంత రహస్యంగా దేవాలయ భూమి కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బయటకు పొక్కించిన మొనగాడు ఎవరు ?? ఎదురులేని అధికారం చలాయించే అధికారిని అవమానభారంలోకి నెట్టేసిన క్రమం ఎట్టిది? అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇచ్చిన ఆర్డర్ను వెనక్కి తీసుకున్నాం అంటూ కలెక్టరేట్ నుంచి విడుదలైన ప్రకటనతో కథ ముగియలేదు నిజానికి అందరిదృష్టి ఇప్పుడే రెవెన్యూ వైపు ఫోకస్ అవుతోంది.
మరోవైపు జరిగిన నష్టాన్ని చిన్నది చేసి తప్పంతటిని ఒక ఇద్దరు అధికారులు పైకి నెట్టేసి ఆనక వారిని రక్షించే పద్ధతిలో మరో స్క్రీన్ ప్లే తయారవుతోందని పరిశీలకులు అంటున్నారు.
ఆలయ భూమి ప్రైవేటుపరం కాకుండా 43 ప్రాపర్టీ రిజిస్టర్ లో నమోదయి ఉన్నా, ఎండోమెంట్ ట్రిబ్యునల్, హైకోర్టు ఉత్తర్వులు ఉన్న బరితెగించి, లేని అధికారాన్ని కట్టబెట్టుకుని నిషేధపు జాబితా నుంచి తప్పించే ప్రయత్నాలను ధైర్యంగా చేయగలిగారంటే అధికారుల వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరన్న దానిపై పలు ఊ హాగానాలు వెలువడుతున్నాయి. ఒక బీజేపీ నాయకుడు గతంలో ఈ భూమిని ప్రైవేటు పరం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో దాన్ని విరమించుకున్నారని తర్వాత కొద్ది సంవత్సరాల క్రిందట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే దృష్టి దానిపై పడి ఆ భూమి కౌలుదారులతో దరఖాస్తు చేయించారని ఎక్కడా ఎవరు అడ్డు రాకుండా ఓ పెద్ద తలకాయను అడ్డం పెట్టుకుని రంగంలోకి దిగారని అంటున్నారు. ఒక డిటి స్తాయి అధికారి చక్రం తిప్పి ఫైళ్ళు నడిపించారని చెప్పుకుంటున్నారు. అడంగల్ లో వన్ బి లో 15 39 బై ఐదు సర్వేనెంబర్ ఎదురుగా అటు మార్కెటింగ్ శాఖ పేరు కానీ ఇటు దేవాదాయ శాఖ పేరు కాని లేకుండా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఉండడం,
ఆ భూమిని కుంభకోణం బయటపడిన నాటి రాత్రి వివాదాస్పద భూమి కేటగిరిలోకి చేర్చి చేతులు దులుపుకోవడం తెలిసిందే.
దేవాదాయ శాఖ భూమిఅని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దీనిని వివాదాస్పద భూమి కేటగిరీలోకి ఏ విధంగా చేర్చారు అన్నది ప్రశ్న.
ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన వారు అమాయకత్వాన్ని నటిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలపై కానీ కార్యక్రమాలపై కానీ మీడియా తప్పుగా వార్తలు రాస్తే వెనువెంటనే వివరణలు కాని ఖండనలు కానీ జారీ చేసే వ్యవస్థ నిద్ర నటిస్తోంది. ఏం మాట్లాడితే ఎక్కడ ఇరు క్కుపోతామని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ భూమిని 22 రిజిస్టర్ లోనే ఉంచామని తప్పేమి జరగలేదన్న విధంగా నమ్మ చెబుతున్నారు.. తమ రిజిస్టర్ లో ఇంకా ఈ భూమి నిషేధపు జాబితాలో కిందనే ఉందని జిల్లా రిజిస్టర్ తో ఓ ప్రకటన ఇప్పించడం చూస్తే
కలెక్టరేట్ పై జాలి వేస్తుంది.
అన్యాయంగా 22 ఏ లో పెట్టిన ప్రైవేట్ జిరయతి భూముల కు విముక్తి కలిగించాలని ప్రతిరోజు ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి సీసీ ఎల్ ఏ అధికారులు చెప్తున్నా కాసులు ఇవ్వనిదే పని జరగదు అంటున్న రెవెన్యూ అధికారులు,బరితెగించి నిబంధనలకు వ్యతిరేకంగా నిషేధపు జాబితాలో ఉన్న ఆలయ భూమి నీ ప్రైవేట్ పరం చేయడానికి తీసుకొన్న శ్రద్ధను గమనించ వచ్చు.
ఈ మొత్తం వ్యవహారం గుట్టు రట్టవ డానికి ఎవరు నడుం బిగించారన్నది ప్రస్తుతానికి ఊహగానాల స్థాయిలోనే ఉంది

